Ghaati : ఇదివరకు సినిమాలలో హీరోల పాత్రలు అంటే ఆదర్శవంతంగా ఉండాలి అనే ఆలోచన ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం తరాలు మారడంతో పాటు, సినిమా కథలు, వాటిలో ఉండే హీరోల పాత్రల విషయంలో కూడా మార్పు మొదలైంది. హీరో స్మగ్లర్ అయినా, లేదా గన్నులు, మారణాయుధాలు చేతబట్టి ఊచ కోత కోసినా సరే జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాంటి వయొలెన్స్ ను తెరపై చూసి ఎంజాయ్ చేయడానికి చాలా ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగానే ఇటీవల కాలంలో సినిమాలు తెరపైకి వస్తున్నాయి. అందుకు నిదర్శనం కేజీఎఫ్, పుష్ప వంటి సినిమాలు. ఇక ఈ నేపథ్యంలోనే ఈ ట్రెండ్ ని ఫాలో అవుతూ మరో లేడీ సూపర్ స్టార్ అనుష్క (Anushka) స్మగ్లర్ పాత్రను పోషించబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఇటీవల కాలంలో ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాపై వచ్చినంత నెగెటివిటీ, విమర్శలు మరో సినిమా విషయంలో కనిపించలేదనే చెప్పాలి. అందులో అల్లు అర్జున్ (Allu Arjun) స్మగ్లర్ పాత్రను పోషించడం ఓ వివాదం. ఇలాంటి స్మగ్లర్ పాత్రలు చేస్తున్న హీరోలకు జనాలు నీరాజనాలు పడుతున్నారు, కానీ మంచి సినిమాలను కూడా ఆదరించండి అంటూ పలువురు స్టార్స్ ఆడియన్స్ ను రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇలాంటి ఒక స్మగ్లర్ పాత్ర చేసిన యాక్టర్ కి నేషనల్ అవార్డు రావడం ఏంటి ? అంటూ విమర్శించిన వారూ ఉన్నారు.
ఇక ఈ దెబ్బకి ఇప్పట్లో స్మగ్లర్ పాత్ర పోషించలంటే నటీనటులు కాస్త ఆలోచించక తప్పదేమో అన్న సిచువేషన్ నెలకొంది. కానీ ‘పుష్ప 2’ సక్సెస్ ఇచ్చిన హై ఆ సిచువేషన్ ని పక్కన పడేసేలా చేసింది. టాలీవుడ్ శివంగి అనుష్క ఇప్పుడు స్మగ్లర్ పాత్రను పోషించబోతున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తే, ఇప్పుడు అనుష్క (Anushka) కూడా స్మగ్లర్ గా మారి గంజాయిని స్మగ్లింగ్ చేసే ట్రైబల్ మహిళ పాత్రలో నటిస్తోందని సమాచారం.
ప్రస్తుతం అనుష్క క్రిష్ దర్శకత్వంలో ‘ఘాటి’ (Ghaati) అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు పూర్తయ్యాయి. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వంశీ కృష్ణారెడ్డి, రాజీవ్ రెడ్డి నిర్మాతలుగా రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ రీసెంట్ గా అనౌన్స్ చేశారు. నేరస్థురాలుగా మారిన ఓ బాధితురాలు కథతో ఈ సినిమా రూపొందుతోందని, ప్రతీకారం ప్రధాన అంశంగా ఈ మూవీ సాగుతుందని టాక్ నడుస్తోంది.
Ghaati సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 18న రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే సినిమాలో అనుష్క (Anushika) స్మగ్లర్ మాత్రం పోషించబోతుందనే వార్త బయటకు వచ్చాక, పుష్పరాజ్ కు మరో బిజినెస్ పార్ట్నర్ దొరికింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఒకవేళ ఈ వార్తలు గనుక నిజమైతే అనుష్క ఎలాంటి నెగెటివిటీని ఎదుర్కోవాల్సి వస్తుందో చూడాలి.