AP TN Rains : ఏపీని మరో తుఫాను పలకరించనుంది. బంగాళా ఖాతంలో ( Bay of Bengal) వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాలు.. ఏపీలోని పలు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలోనే మరో అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తున్నట్లు భారత వాతావరణ శాఖ(IMD) ప్రకటించింది. ఇది క్రమంగా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లోని తీర ప్రాంత జిల్లాలపై(Costal Areas) తీవ్ర ప్రభావం చూపనుందని ఐఎమ్ డీ ప్రకటించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కోస్తా తీరం వైపు దూసుకొస్తున్నట్లు వాతావరణ విభాగం ప్రకటించింది. బుధవారం నాటికి అది తీవ్ర అల్పపీడనంగా బలపడిందని తెలిపిన అధికారులు.. రానున్న 24 గంట్లోల్లో వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్లనున్నట్లు ప్రకటించారు. గతకొంత కాలంగా తరచూ అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. కాగా.. కోస్తా తీరం వెంబడి కదలనున్న ఈ అల్పపీడనం కారణంగా శుక్రవారం రోజున ఏపీ(ap), తమిళనాడు(Tamilanadu) రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు(heavy to very heavy rainfall) కురిసే అవకాశముందని అధికారులు ప్రకటించారు.
అల్పపీడనం కారణంగా.. గురువారం నాడు విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. శుక్రవారం నాటికి శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. మిగతా కోస్తా ప్రాంతాలతో పాటు వాటి చుట్టుపక్కల ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, బాపట్ల, ఏలూరు, అనకాపల్లి, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం తదితర జిల్లాల్లో బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. కాగా.. తీర ప్రాంతాల్లో సముద్రంలో అల్లకల్లోలంగా మారిపోయింది. సాధారణంగా అయితే.. నవంబరు, డిసెంబరు నెలల్లో ఏర్పడే అల్పపీడనాలు తమిళనాడు సమీపంలో తీరం దాటుతాయి. కానీ వాతావరణ మార్పుల(Climate Changes) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంతంలో తీరం దాటాల్సిన అల్పపీడనాలు తమిళనాడులో తీరం దాటుతుండగా… తమిళనాడులో తీరం దాటాల్సిన అల్పపీడనాలు ఏపీలోని తీర ప్రాంతాలను చేరుతున్నట్లుగా అధికారులు గుర్తించారు. కాగా.. బంగాళాఖాతంలో ఈ ఏడాది చివరి నాటికి మరో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశాలున్నట్లు చెబుతున్నారు. దీని ప్రభావం సైతం ఆంధ్రప్రదేశ్ కోస్తా తీర ప్రాంతాలపై ఉండే అవకాశాలున్నాయని తెలుపుతున్నారు.
Also Read : ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఒకసారి మీ ఖాతాలు చెక్ చేసుకోండి
ప్రస్తుత అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని తీరం వెంబడి గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం(Visakha Weather Station) తెలిపింది. ఈ సమయంలో సముద్రం అలజడిగా మారుతుందని తెలిపిన అధికారులు.. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది.