Chandrababu Tollywood : నేడు టాలీవుడ్ పెద్దలు, ఏపీ సీఏం సినీ పెద్దలతో జరగాల్సిన అమరావతి మీటింగ్ వాయిదా పడింది. తెలుగు సినిమా ప్రతినిధులు సమావేశం జరగడం లేదు. తెలుగు ఇండస్ట్రీలోని నిర్మాతలు, దర్శకులు, మా ప్రతినిధులు ఆదివారం సాయంత్రం సిఎం క్యాంప్ కార్యాలయంలో సమావేశం జరగాల్సి ఉంది. చంద్రబాబు ఇప్పటికే అపాయింట్ మెంట్ ఖరారు చేశారు. అయితే ఈ భేటీ పై తర్వాత సినీ ఇండస్ట్రీలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు అందరు అనుకున్నారు. కానీ మీటింగ్ వాయిదా పడింది. ఈ మీటింగ్ వాయిదా పడటానికి సినీ ప్రముఖులే కారణం అని మీడియా వర్గాల సమాచారం.
సీఏం తో భేటీ వాయిదాకు కారణాలు..?
టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు సీఏం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో నేడు సాయంత్రం భేటీ కావాల్సి ఉంది. భేటీకి రావాల్సిన వారిలో ఎక్కువ మంది షూటింగ్ ల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండడంతో పాటుగా, తెలంగాణలో జరుగుతున్న అవార్డుల వేడుక కారణంగా కూడా సినీ పెద్దలు ఏపీకి రాలేకపోతున్నారని తెలిసింది. అయితే తర్వాత ఎప్పుడు సమావేశం ఉంటుదనేది ఇంకా ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ మీటింగ్ మాత్రం వాయిదా పడింది. సినిమా రంగంలోని పలు విభాగాల్లోని ముఖ్యమైన వారు అందుబాటులో లేకపోవడంతో మీటింగ్ రద్దు చేస్తున్నట్లుగా తెలిపింది.. మరో వారం ఈ భేటీ కన్ఫామ్ అవుతారని సమాచారం.
ఆ సమస్యల పై పెద్దల చర్చ..!
ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు నటించిన సినిమా విడుదలను అడ్డుకొనేందుకు ఎగ్జిబిటర్లు తెర వెనుక పావులు కదిపారని ప్రచారం జరిగింది. దానిపై విచారణ చేయాలని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశించారు. వీరమల్లుకు వ్యతిరేకంగా కొందరు చేసిన డిస్కషన్ పవన్ వరకు చేరిందని ప్రముఖ నిర్మాత ఇటీవలా బయట పెట్టారు. పవన్ సూచించిన మార్పులతోపాటు టాలీవుడ్ సమస్యల మీద ప్రధానంగా చర్చించాలని అనుకున్నారు.. ఆ నలుగురు అనే ప్రశ్న గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తుంది. అయితే ఈ మీటింగ్ లో ముఖ్యంగా ఆ నలుగురు విషయంపై చర్చ జరుగుతుందని సమాచారం. అయితే ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది.. ఈ మీటింగ్ తర్వాత ఆ సినిమాలకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో చూడాలి.. ఏది ఏమైనా కూడా సీఎంతో భేటీ అయిన తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్పులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.
Also Read :‘మార్కో 2’ నుంచి తప్పుకున్న ఉన్ని ముకుందన్.. ఆ ఒక్కటే కారణమా..?
రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సినిమాలు..
జూన్ 20వ తేదీన తాను నిర్మించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే నితిన్ నటిస్తున్న తమ్ముడు మూవీ.. మంచు విష్ణు కన్నప్ప మూవీ, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో పాటుగా పలు చిన్న సినిమాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఏ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందో చూడాలి..