BigTV English

Marco 2 : ‘మార్కో 2’ నుంచి తప్పుకున్న ఉన్ని ముకుందన్.. ఆ ఒక్కటే కారణమా..?

Marco 2 : ‘మార్కో 2’ నుంచి తప్పుకున్న ఉన్ని ముకుందన్.. ఆ ఒక్కటే కారణమా..?

Marco 2 : ఈమధ్య మలయాళ ఇండస్ట్రీ నుంచి వస్తున్న ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. గత రెండేళ్లుగా ఆ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా కలెక్షన్లను వసూల్ చేస్తున్నాయి. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చిన ప్రతి సినిమా కూడా ప్రేక్షకుల మనసు దోచుకుంటున్నాయి. గత ఏడాది మలయాళం లో బ్లాక్ బస్టర్ హిట్ అయినా సినిమాలల్లో ఒకటి మార్కో.. మాలీవుడ్ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ లో వర్షం కురిపించింది.. భారీ యాక్షన్స్ సన్నివేశాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. అయితే బాగా వయోలెన్స్ ఉందని కొందరు ఈ సినిమాపై ఇటు ప్రచారం చేసిన సరే సినిమా మాత్రం వసూళ్ల సునామీ సృష్టించింది.. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా మార్కో 2 ఉంటుందని అందరు అభిప్రాయపడ్డారు. అయితే తాజాగా ఈ సీక్వెల్ మూవీ పై హీరో ఉన్ని ముకుందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..


‘మార్కో 2’ నుంచి తప్పుకున్న ఉన్ని ముకుందన్..?

మలయాళ హీరో ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ మార్కో.. ఈ మూవీ పై విడుదలకు ముందుకు ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్న థియేటర్లలో విడుదలయ్యాక సక్సెస్ టాక్ ను అందుకుంది. కొన్ని ప్రాంతాల్లో వ్యతిరేకత ఎదురైనప్పటికి థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అయ్యింది. థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీలో కూడా ఈ మూవీ భారీ వ్యూస్ ను రాబడుతుంది.. ప్రస్తుతం టాప్ లో ఉన్న మూవీల లిస్టులో ఈ మూవీ కూడా ఉంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ ఉందని అనుకున్నారు. కానీ తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ తో ఉన్ని ముకుందన్ చిట్ చాట్ చేశారు. ఓ అభిమాని మార్కో 2 కోసం వెయిటింగ్.. ఎప్పుడొస్తుందని ప్రశ్నించాడు. దానిపై స్పందించిన హీరో ఈ సిరీస్ చెయ్యట్లేదు. వదులుకున్నాను అని అన్నాడు. ఈ మూవీకి వచ్చిన వ్యతిరేఖత, నెగిటివ్ కామెంట్స్ వల్లే ఈ నిర్ణయం తీసుకున్నానని ఆయన అన్నాడు. అంతేకాదు ప్రస్తుతం మార్కో కన్నా బెస్ట్ మూవీని అందించేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ప్రస్తుతం ఆయన చేసిన చాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మరి ఈ భారీ సీక్వెన్స్ లో ఎవరు హీరోగా రాబోతున్నారని ఇండస్ట్రీలో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..


Also Read : తెలుగులో ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు.. ఆ రెండు చూస్తే కన్నీళ్లు ఆగవు..

మార్కో మూవీ.. 

ఈ చిత్రాన్ని మలయాళంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ భాషల్లో రిలీజై భారీ వసూళ్లు రాబట్టింది.. ది మోస్ట్ వయెలెంట్ మూవీగా పేరు తెచ్చుకుంది మార్కో. గతేడాది డిసెంబర్ 20న విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే బెస్ట్ యాక్షన్ సినిమాగా ఆడియెన్స్ ను మెప్పించింది. కేవలం 30 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయ్యాక 100 కోట్లకు పైగా వసూల్ చేసి మరో రికార్డు ను బ్రేక్ చేసింది. మార్కో సినిమాకు హనీఫ్ అదేని దర్శకత్వం వహించారు. షరీఫ్ మహ్మద్ నిర్మాతగా వ్యవహరించారు. రవి బస్రూరు సంగీతం సమకూర్చారు. మార్కో సినిమాలో మితిమీరిన హింసను చూపించారనే అభిప్రాయం ఉంది. హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్న సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘ఎ’ సర్టిఫికేట్ వచ్చింది. ఈ మూవీలో సిద్ధిఖీ, జగదీష్, కబీర్ దుహాన్ సింగ్, అభిమాన్యు తిలకన్, అన్ సోన్ పాల్, యుక్తి తరేజా, ధ్రువ, శ్రీజిత్ రవి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ప్రస్తుతం సోని లైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×