Rajinikanth : తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్వల్ప అనారోగ్య సమస్యలతో చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.. ఆయన ట్రీట్మెంట్ కోసం రజినీ సోమవారం చైన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్యం అందించిన వైద్యులు అయన ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. దీంతో ఆయన కుటుంబం సభ్యులు, అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం పలు చికిత్సలు చేసిన వైద్యులు ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు.
సోమవారం రాత్రి స్వల్ప అస్వస్థతకు గురైన రజినీ, వెంటనే ఆసుపత్రిలో చేరారు.. ఆయనకు పలు చికిత్సలు చేసిన వైద్యులు పలు పరీక్షలు చెయ్యాలని వైద్యులు సూచించారు. అప్పటికే రజినీ చాలా అసౌకర్యంగా ఫీలవ్వడంతో హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు..
తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. రజినీకి చిన్న ట్రీట్మెంట్ ఇచ్చారు. గుండె నుంచి శరీరానికి రక్తాన్ని సరఫరా చేసే రక్తనాలం వాపు వల్లే రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. సర్జరీ లేకుండానే ట్రాన్స్ క్యాథటర్ పద్దతిలో ట్రీట్మెంట్ చేశారు. సీనియర్ ఇంటర్నెషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సతీష్ రజినికి స్టంట్ అమర్చారు..
ప్రస్తుతం రజినికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, అయన అభిమానులు, శ్రేయోభిలాషిలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. మరో రెండు రోజుల్లోనే ఆయనను డిశ్చార్జ్ చెయ్యనున్నట్లు వైద్యులు తెలిపారు. తాజాగా విడుదల చేసిన బుల్టెన్ లో ఈ విషయాన్ని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రజిని ఆరోగ్యం బాగుందని, రొటీన్ చెక్-అప్ కోసం ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉన్న రజినీ కాంత్ సోమవారం రాత్రి పరీక్షల కోసం ఆసుపత్రిలో చేరారు. మంగళవారం పొద్దున్నే ఖాళీ కడుపుతో ఆసుపత్రికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు కానీ చాలా అసౌకర్యం కలిగింది. దాంతో సోమవారం రాత్రి ఆసుపత్రిలో చేరారు అని మంత్రి చెప్పారు. ఇక తాజాగా ఆయన హెల్త్ బులిటెన్ ను చైన్నై అపోలో వైద్యులు విడుదల చేశారు. అభిమానులు ఆందోళన చెందవద్దని చెబుతున్నారు..
ప్రస్తుతం రజినీ కాంత్ వయస్సు 73 ఏళ్లు.. ఈ వయస్సులో ఆయన అనారోగ్యం బారినపడుతున్నాడు. ఆరోగ్యం సహకరించని కారణంగానే ఆయన రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నారు. మరికొద్ది రోజుల్లో పార్టీ ప్రకటన చేస్తారనగా, ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు.. ఈ విషయం ఆయన అభిమానులకు కాస్త నిరాశను కలిగించింది. ఎలాగైనా తమ హీరో రాజకీయాల్లోని రావాలని అభిమానులు అందరు వచ్చి ఇంటి ముందు ధర్నాలు చేసినా, ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆ మధ్య రజినీకాంత్ అమెరికాలో కొంతకాలం పాటు చికిత్స తీసుకున్నారు. అయితే రజినీకాంత్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. రజినీకాంత్ గత చిత్రం జైలర్ బ్లాక్ బస్టర్ హిట్. వరల్డ్ వైడ్ రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ప్రస్తుతం ఆయన కూలీ, వేట్టయాన్ చిత్రాల్లో నటిస్తున్నాడు. వేట్టయాన్ అక్టోబర్ 10న విడుదల కానుంది. కూలీ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఆసక్తి రేపుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా అప్డేట్ ను విడుదల చేయనున్నారు.. ఈ రెండు సినిమాల తర్వాత ఇక సినిమాలకు గుడ్ బై చెబుతున్నారా? లేదా సినిమాలు చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది..