EPAPER

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ విడుదలకు భారీ ప్లాన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Devaki Nandana Vasudeva: ‘దేవకీ నందన వాసుదేవ’ విడుదలకు భారీ ప్లాన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

Devaki Nandana Vasudeva: సూపర్ స్టార్ కృష్ణ, మహేశ్ బాబు ఫ్యామిలీ నుండి హీరోగా ఎంటర్ అయిన మరో వారసుడే అశోక్ గల్లా. 2022లో విడుదలయిన ‘హీరో’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అశోక్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ఎంచుకోకుండా నిదానంగా కథలు వింటూ తనకు సూట్ అయ్యే కథలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. తన కెరీర్‌లో రెండో సినిమాగా తెరకెక్కిన ‘దేవకీ నందన వాసుదేవ’ ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది. ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుంది అనే విషయాన్ని అక్టోబర్ 5న రివీల్ చేయనున్నారు మేకర్స్. ఇక ‘దేవకీ నందన వాసుదేవ’ అనేది అశోక్ గల్లా కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని మేకర్స్ చెప్తున్నారు.


ప్రేక్షకుల్లో బజ్

‘దేవకీ నందన వాసుదేవ’ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. కానీ ఇంతలోనే ఈ సినిమా నవంబర్ 15న విడుదల కానుందని ఇండస్ట్రీలో టాక్ మొదలయ్యింది. అయితే ఇది నిజమో కాదో అక్టోబర్ 5న కన్ఫర్మ్ అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయడం కోసం శంకర్ పిక్చర్స్ రంగంలోకి దిగింది. పైగా ‘దేవకీ నందన వాసుదేవ’ థియేట్రికల్ రైట్స్ కోసం శంకర్ పిక్చర్స్ భారీ మొత్తాన్ని ఖర్చుపెట్టిందని సమాచారం. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి దీనిపై ప్రేక్షకుల్లో మంచి బజ్ ఉంది. దానికి ఒక కారణం హీరో అశోక్ గల్లా అయితే మరొక కారణం ప్రశాంత్ వర్మ.


Also Read: సనాతన ధర్మం.. హీరో అవుదామనుకున్నాడు.. చివరకు జీరోగా మిగిలాడు

ప్రశాంత్ వర్మ కథ

‘దేవకీ నందన వాసుదేవ’కు అర్జున్ జంధ్యాల దర్శకుడిగా వ్యవహరించాడు. కానీ ఈ సినిమాకు కథను అందించింది మాత్రం ప్రశాంత్ వర్మ. ‘హనుమాన్’ సినిమా తర్వాత టాలీవుడ్‌లో ప్రశాంత్ వర్మకు తిరుగులేకుండా పోయింది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనేదాన్ని క్రియేట్ చేసిన ఆయన తెరకెక్కించే సినిమాల కోసం ప్రేక్షకులంతా ఎదురుచూసేలా చేశాడు. ఆ రేంజ్‌లో తన ఫ్యాన్ బేస్ పెంచుకున్నాడు. ప్రస్తుతం తెలుగులోని యంగ్ డైరెక్టర్స్‌లో ప్రశాంత్‌కు సెపరేట్ క్రేజ్ ఉంది. అలాంటి క్రేజీ డైరెక్టర్ ఈ సినిమాకు కథను అందించడానికి తెలియడంతో ప్రేక్షకుల్లో ‘దేవకీ నందన వాసుదేవ’పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

ఫ్రెష్ పెయిర్

‘దేవకీ నందన వాసుదేవ’లో అశోక్ గల్లాకు జోడీగా మానస వారణాసి నటించింది. 2020లో మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న ఈ తెలుగుమ్మాయి.. ‘దేవకీ నందన వాసుదేవ’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన టీజర్స్, పాటల్లో అశోక్, మానస పెయిర్ బాగుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. జూన్‌లోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవ్వడంతో రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ కోసం అక్టోబర్ 5న ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్. సోమినేని బాలకృష్ణ.. ఈ చిత్రాన్ని నిర్మించగా భీమ్స్ మ్యూజిక్ అందించాడు. ఇప్పటికే ‘దేవకీ నందన వాసుదేవ’ నుండి మూడు పాటలు విడుదలయ్యాయి.

Related News

Martin Movie Review : మార్టిన్ మూవీ రివ్యూ…

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!

Big Stories

×