IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు {ఆర్సీబీ} గత 17 సీజన్లుగా మూడుసార్లు ఫైనల్ చేరినా.. ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేకపోయింది. ప్రత్యర్థి జట్ల ఎత్తులకు చిత్తై.. ఆఖరి మెట్టుపై బోల్తా పడి ట్రోఫీని చేజార్చుకుంటుంది. అయితే ఈసారి ఎలాగైనా కప్పు కొట్టాలనే నేపథ్యంలో ఐపీఎల్ 2025 18వ ఎడిషన్ కి సంబంధించి మెగా వేలంలో నికార్సైన టి-20 స్పెషలిస్టులను సెలెక్ట్ చేసుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు.
Also Read: Champions Trophy 2025: PCBపై రిజ్వాన్ తిరుగుబాటు..యాక్షన్ తీసుకోనున్న ఛైర్మన్ నఖ్వీ ?
అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో మెరుపులు మెరిపించగల ప్లేయర్లకు జట్టులో చోటు కల్పించింది. ఇందులో ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా {Krunal Pandya}పేరు కూడా ఉంది. లెఫ్ట్ హ్యాండ్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యాని ఆర్సిబి మెగా వేలంలో రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఇతడిని కొనుగోలు చేసేందుకు బెంగుళూరు తో పాటు రాజస్థాన్ జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. కానీ చివరకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు ఈ ఆల్రౌండర్ {Krunal Pandya} ని దక్కించుకుంది.
2016లో ఐపిఎల్ లోకి అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా.. ముందు ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెంయిట్స్ జట్ల తరఫున ఆడాడు. 2021లో ముంబై ఇండియన్స్ జట్టు నుండి బయటకు వచ్చిన పాండ్యాని.. లక్నో ఫ్రాంచైజీ రూ. 8.25 కోట్లకు దక్కించుకుంది. కానీ అతడు {Krunal Pandya} ఆశించినంత స్థాయిలో రాణించలేకపోయాడు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్సీ అవసరం ఉన్నందున.. కృనాల్ పాండ్యాని ఆర్సిబి కెప్టెన్ గా నియమించబోతోందని తాజాగా అభిషేక్ మల్హోత్రా పేర్కొన్నారు.
కానీ కృనాల్ పాండ్యా {Krunal Pandya}కి ఐపీఎల్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ప్రత్యేక అనుభవం లేదు. లక్నో సూపర్ జెయింట్స్ కి ఆరు మ్యాచ్ లకు కృనాల్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరిస్తే.. ఇందులో ఆ జట్టు కేవలం 3 మ్యాచ్ లలో మాత్రమే విజయం సాధించింది. ఒకవేళ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నాయకత్వ బాధ్యతలను కృణాల్ పాండ్యాకి అప్పగిస్తే అతడు ఏ మేరకు రానిస్తాడు..? అన్నది వేచి చూడాలి. ఇక ఇప్పటివరకు ఐపీఎల్ లో 127 మ్యాచ్ లు ఆడిన కృణాల్ పాండ్యా.. 132.82 స్ట్రైక్ రేట్, 22.56 సగటుతో 1,647 పరుగులు చేశాడు.
Also Read: Sreesanth- Sanju: సంజు పంచాయితీ… కేరళ క్రికెట్ ను గెలికిన వివాదాస్పద బౌలర్ శ్రీశాంత్ ?
ఇక తన స్పిన్ మాయాజాలంతో {Krunal Pandya} ఇప్పటివరకు 127 మ్యాచ్ లలో 34.28 సగటుతో 76 వికెట్లు పడగొట్టాడు. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టు నాయకత్వ బాధ్యతలను కృణాల్ పాండ్యాకి అప్పగించబోతున్నారనే విషయం తెలిసిన ఆ జట్టు అభిమానులు.. విరాట్ కోహ్లీకి తిరిగి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాలని కామెంట్స్ చేస్తున్నారు. కానీ మరి కొంతమంది మాత్రం.. విరాట్ కోహ్లీ ఇప్పటికే ఫామ్ కోల్పోయి రాణించలేకపోతున్నాడని, కెప్టెన్సీ భారం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
https://twitter.com/mufaddl_parody/status/1888185174523056554