AR Rahman: ఇటీవల ఏఆర్ రెహమాన్ (AR Rahman).. తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ముందుగా సైరా భాను తరపున లాయర్ ద్వారా ఈ విషయం బయటికొచ్చింది. ఆ తర్వాత రెహమాన్ ఈ విషయంపై స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేశారు. దీంతో 29 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టడమేంటి అంటూ ప్రేక్షకులంతా ఆశ్చర్యపోయారు. ఇంతలోనే ఏఆర్ రెహమాన్ అసిస్టెంట్ అయిన మోహిని డే కూడా తన భర్త నుండి విడాకులు తీసుకుంటున్నట్టుగా ప్రకటించడంతో వీరిద్దరూ రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ రూమర్స్ మొదలయ్యాయి. వాటిపై రెహమాన్ సీరియస్‌గా స్పందించారు.
ఇవన్నీ అనవసరం
తన పర్సనల్ లైఫ్ గురించి తప్పుడు వార్తలను, సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై ఏఆర్ రెహమాన్ పరువునష్టం దావా వేశారు. ఈ పిటీషన్‌ను తన టీమ్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘మానసికంగా ఇబ్బందులు ఎదుర్కోవడం వల్లే తాము విడిపోతున్నామని ఏఆర్ రెహమాన్ ప్రకటించారు. దీంతో చాలామంది ఆయనకు సపోర్ట్‌గా మెసేజ్‌లు చేశారు. కానీ కొన్ని సోషల్ మీడియా, యూట్యూబ్ ప్లాట్‌ఫార్మ్స్ మాత్రం వారి పర్సనల్ లైఫ్ గురించి కల్పిత కథలను ప్రసారం చేయడం మొదలుపెట్టాయి. ఇండస్ట్రీలో ఉన్న ఇతర వ్యక్తులను వీరి విడాకుల గురించి అభిప్రాయాలు అడుగుతూ ఆ వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ఇదంతా అనవసరం’ అని ఆ పిటీషన్‌లో పేర్కొన్నారు.
Also Read: విడాకుల తరువత మళ్లీ కలవనున్న జీవీ ప్రకాష్-సైంధవి.. ?
చట్టరీత్యా నేరం
‘ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రసారమవుతున్న అభ్యంతరకరమైన కంటెంట్‌లో ఏ మాత్రం నిజం లేదు. కేవలం రెహమాన్ మంచి పేరును దెబ్బతీయడానికి మాత్రమే ఇలాంటివి జరుగుతున్నాయి. చీప్ పబ్లిసిటీతో ఆయనకు పరువు నష్టాన్ని కలిగిస్తున్నారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌ను ఆపరేట్ చేసేవారు, వాటిని ఫాలో అవుతున్న సబ్‌స్క్రైబర్లు ఇలాంటి వేధింపులకు పాల్పడడం చట్టరీత్యా నేరమని తెలుసుకోవాలి. అందుకే తన గురించి ఇలాంటి కంటెంట్‌ను ప్రసారం చేసినవాళ్లు దానిని తొలగించడానికి గంట నుండి 24 గంటల సమయాన్ని అందిస్తున్నారు ఏఆర్ రెహమాన్’ అంటూ తప్పుడు వార్తలను తొలగించడానికి సమయం ఇస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
జైలుశిక్ష తప్పదు
‘ఒకవేళ ఆ తప్పుడు వార్తలను తొలగించకపోతే 2023 భారతీయ న్యాయ సన్హిత సెక్షన్ 356 ప్రకారం నిందితులు రెండేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. దాంతో పాటు అదనంగా ఫైన్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. తనపై వచ్చిన తప్పుడు ప్రచారాలపై, వాటిని క్రియేట్ చేసినవారిపై ఏఆర్ రెహమాన్ ఈ పరువునష్టం దావా వేస్తున్నారు. యూట్యూబ్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్ లేదా ఏదైనా ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్.. ఇలా అన్ని సామాజిక మాధ్యమాల నుండి ఈ తప్పుడు ప్రచారాలు అన్నీ తొలగిపోవాలి’ అంటూ ఏఆర్ రెహమాన్ తరపున న్యాయవాది ఈ పిటీషన్‌ను పూర్తిగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇక ఏఆర్ రెహమాన్‌తో పాటు తన కుమారుడు కూడా ఇప్పటికే ఈ రెండో పెళ్లి వార్తలపై సీరియస్ అయ్యాడు.
Notice to all slanderers from ARR's Legal Team. pic.twitter.com/Nq3Eq6Su2x
— A.R.Rahman (@arrahman) November 23, 2024