BigTV English

The Creek Planet School: బాలయోగి స్టేడియంలో ది క్రీక్ ప్లానెట్ స్కూల్ వార్షిక క్రీడోత్సవాలు

The Creek Planet School: బాలయోగి స్టేడియంలో ది క్రీక్ ప్లానెట్ స్కూల్ వార్షిక క్రీడోత్సవాలు

 


The Creek Planet School: ది క్రీక్ ప్లానెట్ స్కూల్  ( The Creek Planet School ) వార్షిక క్రీడోత్సవానికి గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి స్టేడియం వేదిక నిర్వహించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధులుగా వింగ్ కమాండర్ శ్రీకాంత్, ఇండియన్ అథ్లెట్ నందిని అగసారా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ది క్రీక్ ప్లానెట్ స్కూల్ చైర్మన్ నీ బొల్లినేని శ్రీనయ్య, వైస్ చైర్మన్ పాండురంగా చారి, ఫౌండర్ అండ్ డైరెక్టర్ నరేంద్ర ప్రసాద్, అకడమిక్ హెడ్ Dr. జయశ్రీ నాయర్, COO Dr. జీవని గద్దె, అకాడమిక్ ఆఫీసర్ అనుపమ దేవి వివిధ శాఖల ప్రిన్సిపల్స్, వైస్ ప్రిన్సిపాల్ హాజరయ్యారు.

Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్టులో దుమ్ము లేపుతున్న టీమిండియా యశస్వి, రాహుల్…20 ఏళ్ళ రికార్డు బ్రేక్ !


Creek Planet School Annual Sports Festival at Balayogi Stadium

Also Read: IND vs Aus BGT Trophy: బుమ్రా దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలిన ఆసీస్‌..!

విశిష్ట అతిధి క్రీడాజ్యోతిని వెలిగించి విద్యార్ధి క్రీడా నాయకులకు అందజేశారు. మస్కట్ రిలీజ్ చేసి బెలూన్లు గాలిలోకి వదలడంతో కార్యక్రమం ప్రారంభమైంది. సీనర్జిటిక్ ఎక్భా విగాంజ దీ బ్లెస్సింగ్ గ్లోరీ ఆఫ్ ది క్రీక్ థీమ్ తో సాగిన కార్యక్రమం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. విద్యార్ధులు ప్రదర్శించిన డ్రిల్స్, మార్షల్ ఆర్టీ, యోగ, కరాటే, కోలాటం ఆహుతులను ఆకర్షించాయి. క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరికీ విశిష్ట అతిధి చేతులమీదుగా సర్టిఫికెట్స్, మెడల్స్ అందజేశారు.

Also Read: Bumrah – Kapil Dev: ఆసీస్‌ గడ్డపై జస్ప్రీత్ బుమ్రా చరిత్ర..కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌ !

గత సంవత్సరం ఆల్ ఇండియా సీనియర్ సెకండరీ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులను, ఉపాధ్యాయులను ఈ సందర్భంగా యాజమాన్యం వారు సత్కరించారు ముఖ్య అతిథి మాట్లాడుతూ క్రీడలు శారీరక, మానసిక ఆరోగ్యం తో పాటు క్రీడాస్ఫూర్తిని పట్టుదలను పెంచుతాయని నేటి రోజుల్లో చదువు వల్ల ఎదుర్కొంటున్న ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు. క్రీడలను కూడా చదువులో భాగం చేయాలని అప్పుడే దృఢ భారత నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

Also Read: IND vs AUS 1st Test: పెర్త్ టెస్ట్‌లో చేతులెత్తేసిన టీమిండియా.. 150 పరుగులకే ఆలౌట్‌

క్రీడలను ప్రోత్సహిస్తూ ఇంత అద్భుత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యాజమాన్యానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు . తల్లిదండ్రులు మాట్లాడుతూ వారికి నిర్వహించిన ఆటల పోటీలు వారి బాల్యాన్ని గుర్తు చేశాయని హర్షాన్ని వ్యక్తం చేశారు. వారి చిన్నారులొ దాగివున్న ప్రతిభను వెలికితీస్తున్న యాజమాన్యానికి, వారి సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తల్లిదండ్రులకు పాఠశాల సిబ్బందికి యాజమాన్యం వారు కృతజ్ఞతలు తెలిపారు. జాతీయగీతంతో కార్యక్రమం ముగిసింది. ( The Creek Planet School )

Also Read: IPL 2025 schedule: ఐపీఎల్ 2025 టోర్న మెంట్ తేదీలు ఖరారు..ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే ?

Related News

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Big Stories

×