GV Prakash Kumar: ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో కోలీవుడ్ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కూడా ఒకరు. ఒక పక్క హీరోగా.. ఇంకోపక్క మ్యూజిక్ డైరెక్టర్ గా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఇక ఈ మధ్య హిట్ అయిన లక్కీ భాస్కర్ సినిమాకు కూడా జీవినే సంగీతం అందించాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
జీవీ ప్రకాష్ కెరీర్ గురించి పక్కన పెడితే.. ఈ ఏడాదే ఆయన తన భార్య సైంధవికి విడాకులు ఇచ్చిన విషయం తెల్సిందే. జీవీ భార్య సైంధవి కూడా ఒక గాయని. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దాదాపు 13 సంవత్సరాలు స్నేహితులుగా ఉన్నఈ జంట ఇరు కుటుంబాలను ఒప్పించి పెద్దల సమక్షంలో 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరికి అన్వి అనే కూతురు ఉంది.
Deepthi Sunaina: కాటుక కళ్లతో కైపెక్కిస్తున్న దీప్తి.. ఎలా షన్ను ఇంత అందాన్ని వదిలేసావ్
పెళ్లి తరువాత జీవీ ప్రకాష్.. నటుడిగా, మ్యూజిక్ డైరెక్టర్ గా స్టార్ డమ్ ను అందుకున్నాడు. ఇంకోపక్క సైంధవి కూడా సింగర్ గా కొనసాగుతూనే వస్తుంది. అయితే కొన్ని కారణాల వలన వీరు తమ వైవాహిక జీవితం నుంచి తప్పుకున్నట్లు తెలిపారు.
” మా విడాకులు ఎవరి బలవంతం వలన తీసుకోలేదు. ఈ నిర్ణయం మేమిద్దరం కలిసి మా అభివృద్ధి కోసం తీసుకున్నాము. జీవీ ప్రకాష్ మరియు నేనూ మా స్కూల్ డేస్ నుండి 24 సంవత్సరాలుగా స్నేహితులు, మరియు మేము ఆ స్నేహాన్ని కొనసాగిస్తూనే ఉంటాము. ధన్యవాదాలు” అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది విడాకులు తీసుకొని విడిపోయిన స్టార్ సెలబ్రిటీస్ వీరే..
ఇక వారు చెప్పిన మాట మీదనే అడుగులు ముందుకేస్తున్నారు. భార్యాభర్తలుగా విడిపోయినా.. స్నేహితులుగా కలిసే ఉంటున్నారు. తాజాగా.. తన మాజీ భర్త సంగీత కచేరీకి సైంధవి రావడం మాత్రమే కాకుండా.. ప్రమోషన్ కూడా చేయడం గమనార్హం.
డిసెంబర్ 7న మలేయాషియాలో జీవీ ప్రకాష్ మ్యూజిక్ కన్సర్ట్ జరగనుంది. ఆ మ్యూజిక్ గ్రూప్ లో సైంధవి కూడా సింగర్ గా వెళ్తుంది. పెళ్లి తరువాత ఈ మాజీలిద్దరు మలేషియాలో ఒకే వేదికపై కలిసి కనిపించబోతున్నారు. దీంతో వీరి ఫ్యాన్స్.. సూపర్ అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ వేదికపై ఈ మాజీ జంట ఎలా అలరించనున్నారో చూడాలి.