Amaravathiki Aahwanam: హారర్ కథలంటే ఇష్టపడని ప్రేక్షకులు చాలా తక్కువ. అలాంటి కథలంటే భయం అని చెప్తూనే వాటిని ఇష్టంగా చూసేవారు ఉంటారు. అలాంటి హారర్ సినిమాలు అనేవి మినిమమ్ గ్యారెంటీ హిట్లుగా నిలుస్తున్నాయి. కానీ ఆ హారర్ సినిమాలను తెరకెక్కించి ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడం అంత ఈజీ కాదు. ఇలాంటి రిస్కీ దారిలో ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేయడానికి సిద్ధమవుతున్నాడు దర్శకుడు జీవీకే. ‘అమరావతికి ఆహ్వానం’ అనే టైటిల్‌తో జీవీకే తెరకెక్కిస్తున్న హారర్ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. ఉగాది సందర్భంగా విడుదలయిన ఈ ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తోంది. యాక్టర్లను హైలెట్ చేస్తూ ఈ ఫస్ట్ లుక్ బాగుందని ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు.
అమరావతికి ఆహ్వానం
టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. ఏ భాషలో అయినా హారర్ థ్రిల్లర్ కథలను ఉన్న క్రేజే వేరు. ఇటీవల బాలీవుడ్‌లో అయితే ఈ హారర్ కథలతో ఏకంగా కొత్త యూనివర్సే ప్రారంభమయ్యింది. ఇవి మినిమమ్ గ్యారెంటీ కథలు అనుకుంటున్న నిర్మాతలు.. దీనిపై ఎంత బడ్జెట్ అయినా పెట్టడానికి రెడీ అవుతున్నారు. అలా బాలీవుడ్‌లో ఇప్పటికే ‘ముంజ్యా’, ‘స్త్రీ 2’ లాంటి సినిమాలు సెన్సేషనల్ హిట్స్‌గా నిలిచాయి. టాలీవుడ్‌లో ఇంకా అలాంటి పూర్తిస్థాయి హారర్ సినిమాలు ఏమీ రాలేదు. విడుదయిన హారర్ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆ రేంజ్‌లో మెప్పించలేకపోతున్నాయి. ఆ లోటు తీర్చడానికే ‘అమరావతికి ఆహ్వానం’ మూవీ వచ్చేస్తుంది అంటున్నారు మేకర్స్.
ఆసక్తికరమైన పోస్టర్
ఉత్కంఠభరితమైన కథ, కథనంతో సీట్ ఎడ్జ్ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది ‘అమరావతికి ఆహ్వానం’. ఈ మూవీలో ‘అక్కడొకడుంటాడు’ ఫేమ్ శివ కంఠంనేని హీరోగా నటిస్తున్నాడు. తనతో పాటు ఎస్తర్, ధన్య బాలకృష్ణ, సుప్రిత, హరీష్.. ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. వీరందరూ ఉన్న ఫస్ట్ లుక్ తాజాగా విడుదలయ్యింది. రైటర్‌గా ఇప్పటికే గుర్తింపు సాధించిన జీవీకే.. ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకుల ముందుకు రాగా దీంతోనే అందరిలో క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు మేకర్స్. టైటిల్‌తోనే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇందులో దర్శకుడు డీటైల్స్ దాచిపెట్టాడని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
Also Read: సినిమాలో ఎనర్జీ తగ్గింది.. రెమ్యునరేషన్ కావాలంటూ హీరో యూటర్న్.?
ఒకే ఎక్స్‌ప్రెషన్
‘అమరావతికి ఆహ్వానం’ (Amaravathiki Aahwanam) ఫస్ట్ లుక్‌లో నటీనటులంతా బ్లాక్ డ్రెస్ వేసుకొని ఉన్నారు. అందరూ సీరియస్ లుక్‌లోనే కనిపిస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో, బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల అందరి మొహాలు పూర్తిగా రివీల్ కాకపోయినా.. అందరి మొహాల్లో ఒక విధమైన భయం కనిపిస్తుంది. దీంతో పోస్టర్‌లో ఆ హారర్ థ్రిల్లర్ మూడ్ బాగా కనిపిస్తుందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ అందింది. లైట్ హౌస్ సినీ మ్యాజిక్ బేనర్‌పై కేఎస్ శంకర్‌రావు, ఆర్ వెంకటేశ్వర రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. పద్మనాభన్ బరద్వాజ్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.