BigTV English

Shalini Pandey : ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలో మళ్లీ ఛాన్స్ వస్తే… అయ్ బాబోయ్ అంత మాట అనేసిందేంటి షాలిని!?

Shalini Pandey : ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలో మళ్లీ ఛాన్స్ వస్తే… అయ్ బాబోయ్ అంత మాట అనేసిందేంటి షాలిని!?

Shalini Pandey : సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ సెట్ చేసిన ఈ మూవీతోనే హీరోయిన్ గా పరిచయమైంది షాలిని పాండే. విజయ్ దేవరకొండతో కలిసి ప్రీతి పాత్రలో అదరగొట్టింది. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుని ఓవర్ నైట్ స్టార్ గా మెరిసింది. అయితే ఆ మూవీ తర్వాత ఇప్పటిదాకా షాలిని ఖాతాలో చెప్పుకోదగ్గ హిట్ పడలేదు. తాజాగా ‘డబ్బా కార్టెల్’ (The Dabba Cartel) అనే సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాలిని పాండే మరోసారి ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలో ఛాన్స్ వస్తే నటిస్తారా? అనే ప్రశ్నకు షాకింగ్ సమాధానం చెప్పింది.


మరోసారి ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలో…

‘డబ్బా కార్టెల్’ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రీసెంట్ గా రిలీజ్ అయింది. చాలా కాలం తరువాత ఈ సిరీస్లో షాలిని పాండేకు నటించడానికి స్కోప్ ఉన్న మంచి పాత్ర దొరికింది. ఇక ఇందులో షాలిని పాండే నటనపై  ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో “డబ్బా కార్టెల్ సిరీస్ లో బలమైన మహిళగా కనిపించిన తర్వాత కూడా మీరు మరోసారి అర్జున్ రెడ్డి లాంటి సినిమాను చేస్తారా?” అనే ప్రశ్న ఎదురయింది.


దీనికి షాలిని పాండే స్పందిస్తూ “ఆ టైంలో నాకు ప్రీతి పాత్రపై చాలా నమ్మకం ఉంది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే దాన్ని మరింత స్ట్రాంగ్ గా చేసి ఉండొచ్చు అనిపిస్తుంది. అప్పుడు నేను చాలా అమాయకురాలిని కాబట్టి ఆ పాత్రను అలాగే చేశాను. ఆ పాత్రను ‘రా’గా చేయడం అవసరం కాబట్టి అదే బెటర్. కానీ ఇప్పుడు అలాంటి పాత్ర వస్తే నో చెప్తానా? అంటే కచ్చితంగా కాదు. కాకపోతే ఆ రోల్ ని మరింత నమ్మకంగా, అవగాహనతో చేసేదాన్ని. ఒకవేళ ఇప్పుడు గనక అలాంటి పాత్రను సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నేను కచ్చితంగా డిఫరెంట్ గా చేస్తాను. నిజాయితీగా చెప్పాలంటే నా డైరెక్టర్ ని అడిగి కొన్ని మార్పులు చేర్పులు చేసుకున్న తర్వాతే ఆ రోల్ ని అంగీకరిస్తాను” అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

దీంతో షాలిని పాండేకి ‘అర్జున్ రెడ్డి’ సినిమాలో చేసిన పాత్ర నచ్చలేదా? ఇంతటి స్టార్ డం ఇచ్చిన సినిమా గురించి అంత మాట అనేసిందేంటి ? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నెట్ ఫ్లిక్స్ లో ‘డబ్బా కార్టెల్’ స్ట్రీమింగ్ 

ఇదిలా ఉండగా రీసెంట్ గా ‘డబ్బా కార్టెల్’ అనే సిరీస్ రిలీజ్ అయింది. ఇందులో షాలిని పాండే రాజీ అనే పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. హితేష్ భాటియా ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఇందులో షాలిని పాండేతో పాటు షబానా అజ్మీ, జ్యోతిక కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×