BigTV English

Arjun Son Of Vyjayanthi Twitter Review: ‘ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ‘ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Arjun Son Of Vyjayanthi Twitter Review: ‘ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ‘ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?

Arjun Son Of Vyjayanthi Twitter Review: నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలం తర్వాత ఒక మాస్ మసాలా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గతంలో వచ్చిన కత్తి తర్వాత ఈ సినిమా అలాంటి జోనర్ లో వచ్చింది. కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాని అశోకా క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ తో కలిసి అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు కలిసి నిర్మిస్తున్నారు. ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకి సంగీత దర్శకుడు. సాయి మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.. భారీ అంచనాలతో థియేటర్లలోకి ఇవాళ రిలీజ్ అయ్యింది.. మొదటి షో నుంచి టాక్ పాజిటివ్ గానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మూవీని చూసిన నెటీజన్స్ సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ఈ మూవీ ట్విట్టర్ రివ్యూ ఎలా ఉంది. మూవీ టాక్ ఏంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..


నందమూరి అభిమానులకు ఇది మాస్ ట్రీట్.. ఈ సినిమా హిట్ కావడం తథ్యం. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఈ సినిమాకు బలంగా నిలవడమే కాకుండా అదరగొట్టేలా ఉంటాయి. ఈ సినిమా గురించి పూర్తి రివ్యూ 9 గంటల తర్వాత చెబుతాను అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.

ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడం పక్కా.. తల్లి కొడుకుల సెంటిమెంట్ తో పాటుగా పవర్ ఫుల్ పోలీసు యాక్షన్ సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఖచ్చితంగా మూవీ సూపర్ హిట్ అవుతుందని ట్వీట్ చేశారు.

తల్లి, కొడుకుల మధ్య అనుబంధంతో వచ్చే సినిమాలకు ఎప్పుడు స్పెషల్ బాండింగ్ ఉంటుంది. ఈ సినిమా కూడా అందరి అభిరుచులకు దగ్గరగా ఉంటుందని భావిస్తున్నాను. మళ్లీ చాలా రోజుల తర్వాత లేడీ సూపర్ స్టార్‌ విజయశాంతిని చూడటం చాలా సంతోషంగా ఉంది. విజయశాంతి, కల్యాణ్ రామ్‌కు భారీ సక్సెస్ లభించాలని కోరుకొంటున్నాను అని హీరో సాయిధరమ్ తేజ్ ట్వీట్ చేశారు..

https://x.com/IamSaiDharamTej/status/1912833428543647842?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1912833428543647842%7Ctwgr%5Ee0833729f282d016ae38524c8387bb5574fadb80%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Fm.test.in%2F

 

నందమూరి కళ్యాణ్ రామ్ అన్న కమ్ బ్యాక్.. తమ్ముడు కాలర్ ఎగరేస్తే ఎట్టా ఉంటుందో చూశాం.. రేపు అన్న ఎగరేస్తే ఎట్టా ఉంటుందో చూడబోతున్నాం అని ట్వీట్ చేశారు.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా రిలీజ్ సందర్భంగా యూఎస్ ప్రేక్షకులకు కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రత్యేకంగా మెసేజ్ అందజేశారు. అమెరికా ప్రీమియర్లు గ్రాండ్‌గా మొదలు కాబోతున్నాయి. ఈ సినిమాను హిట్ చేయాలని కోరారు అని యూఎస్ డిస్టిబ్యూటర్ ట్వీట్ చేశారు.

ఈ సినిమాకు సంబంధించి యూఎస్ ప్రీమియర్ల తర్వాత నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో వెల్లడించిన రివ్యూలు, అభిప్రాయాలు పాజిటివ్ గానే ఉన్నాయి. మొత్తానికి కళ్యాణ్ రామ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని రివ్యులు చెబుతున్నాయి. మరి కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి..

 

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×