BigTV English

Actor Siddique: నటిపై లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. పరారిలో నటుడు సిద్ధిఖీ

Actor Siddique: నటిపై లైంగిక వేధింపుల కేసులో మరో ట్విస్ట్.. పరారిలో నటుడు సిద్ధిఖీ

Actor Siddique: ఇటీవల ఫిలిం ఇండస్ట్రీలలో లైంగిక వేధింపుల కేసులు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. హేమా కమిటీ అందుబాటులోకి వచ్చింది.. మలయాళ సీనియర్ నటుడు సిద్ధిఖీ తనను రేప్ చేశాడంటూ నటి రేవతి సంపత్ చేసిన ఆరోపణలు మాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.. దీనిపై సమగ్ర చర్యలు జరిపారు.. అయన నిజంగానే లైంగిక దాడి చేసినట్లు తేలడంతో అతనిపై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఈ విషయం పై సమాచారం అందడంతో నటుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.


మలయాళ ఇండస్ట్రీలో హేమా కమిటీ నివేదికలో విడుదలైన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ‘మీటూ’ ఉద్యమంలో పలువురు ప్రముఖ నటీనటులు, దర్శకులు, హీరోలు పీకల్లోతు వివాదంలో ఇరుక్కుపోయారు. దీనిలో భాగంగా ప్రముఖ నటుడు సిద్ధిఖీపైన ఓ నటి అత్యాచార ఆరోపణలతో ఫిర్యాదు చేసింది. ఓ తమిళ లో అవకాశం రావాలంటే తన కోరిక తీర్చాలని బలవంతం చేసినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే సిద్ధిఖీ డిమాండ్లను నటి తిరస్కరించడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.. సిద్ధిఖీ ప్రధాన పాత్రలో నటించిన సుఖమయిరిక్కట్టే ప్రీమియర్ షోకు నన్ను ఆహ్వానించాడు. షో ముగిసిన తర్వాత నన్ను తిరువనంతపురంలోని మస్కట్ హోటల్‌కు తీసుకెళ్తాడు. అక్కడ తన పై లైంగిక దాడి చేసి మరి రేప్ చేసినట్లు ఆమె ఆరోపించింది. దీనిపై ప్రశ్నిస్తే తనను దారుణంగా కొట్టినట్లు ఆరోపించారు.. ఇక హోటల్ లో బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఆమె ఇచ్చినా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ చేపట్టారు..

Arrest warrant issued on actor Siddiqui
Arrest warrant issued on actor Siddiqui

ఇక తన పై వస్తున్న ఆరోపణల పై నటుడు ఖండించారు. అవన్నీ కేవలం పూకార్లే అని కొట్టి పడేశారు. 2019 నుంచి సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు. మరోవైపు సిద్ధిఖీ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా.. కేరళ హైకోర్టు దానిని కొట్టివేసింది. సిద్ధిఖీ ముందస్తు బెయిల్ కోర్టు తిరస్కరించింది. ఇక ఆ తర్వాత రేవతి మీడియా ముందుకు వచ్చి తన ఆవేదన చెప్పుకుంది.. ఈరోజు ఆమె తీర్పు అనుకూలంగా వచ్చిందని సంతోషంగా ఉందని చెప్పింది. అయితే నటుడు సిద్ధిఖి లైంగిక దాడికి పాల్పడంతో ఆయన పై పోలీసులు అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. ప్రస్తుతం ఆయన పరారిలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు.. ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×