BigTV English

Laila : ‘లైలా’ను చూసి దడుచుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు… బిజినెస్ కష్టమేనా ?

Laila : ‘లైలా’ను చూసి దడుచుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లు… బిజినెస్ కష్టమేనా ?

Laila : గత ఏడాది వరస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నించిన యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). ఈ ఏడాది ఆయన హీరోగా నటించిన ‘లైలా’ (Laila) మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది. రామ్ నారాయన్ (Ram Narayanan) దర్శకత్వంలో, విశ్వక్ సేన్ హీరోగా, ఆకాంక్ష శర్మ (Aknaksha Sharma) హీరోయిన్ గా నటిస్తున్న ‘లైలా’ అనే ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రాబోతోంది. విశ్వక్ సేన్ తను ఎన్ని సినిమాలు చేసినా ‘లైలా’ తన కెరీర్ లోనే ఎంతో స్పెషల్ అంటున్నారు. కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఈ మూవీని కొనడానికి దడుచుకుంటున్నారని ఇన్సైడ్ వర్గాల సమాచారం.


‘లైలా’ బిజినెస్ కష్టమేనా?

విశ్వక్ సేన్ ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో పున్నారు. గత ఏడాది ఈ హీరో నటించిన సినిమాల్లో ‘గామి’ ఒక్కటే అంతో ఇంతో బెటర్ అనిపించుకుంది. అదే ఏడాది రిలీజ్ అయిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’, ‘మెకానిక్ రాఖీ’ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యాయి, ఎప్పుడు పోయాయి అన్న విషయం కూడా ఎవరికీ తెలియదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేస్తున్న ‘లైలా’ మూవీ రిలీజ్ కి సిద్ధమవుతోంది.


ఇందులో విశ్వక్ సేన్ ‘లైలా’గా అమ్మాయి వేషంలో కనిపించబోతున్నాడు. మొదట్లో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడు విశ్వక్ సేన్ అమ్మాయిగా ఉన్న ఫోటోని రిలీజ్ చేశారు. దీంతో మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఆ తర్వాత ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమాలో విశ్వక్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్టు వెల్లడించారు. మొత్తానికి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా ఈ మూవీని రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. కానీ మరోవైపు ఈ మూవీ బిజినెస్ చాలా కష్టంగా సాగుతుందని అంటున్నారు.

ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ‘లైలా’ మూవీని ప్రొడ్యూసర్ని చూసే కొంటున్నారట. హీరోని చూసి కొనడం కష్టమని మొహం మీద చెప్పేస్తున్నారని టాక్ నడుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, ఈ మూవీకి ఫుల్ మనీని పే చేసే ధైర్యం చేయలేకపోతున్నారట. అందుకే డిస్ట్రిబ్యూటర్లు ఓన్లీ అడ్వాన్స్ ఇస్తున్నారని అంటున్నారు. ఈ వార్తలో ఎంతవరకు నిజం అనే విషయం తెలీదు గానీ, విశ్వక్ సేన్ ‘లైలా’ మూవీకి బిజినెస్ చాలా కష్టంగా జరుగుతోందని జోరుగా ఫిలింనగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ఇక ఈ మూవీని సైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మాత సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

ఈ బజ్ తో కష్టమే 

‘లైలా’ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నప్పటికీ పెద్దగా బజ్ లేకపోవడం గమనార్హం. నిర్మాతల కోసమే ఈ మూవీని డిస్ట్రిబ్యూటర్ లో కొంటున్నప్పటికీ, నష్టాలు తప్పవా అనిపించేలా ఉంది పరిస్థితి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ఎలాంటి ఎఫెక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. మరోవైపు డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. ఒకవేళ డీల్స్ క్లోజ్ అయినా ఫిబ్రవరి 14న పదుల సంఖ్యలో సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. మరి వాటన్నింటితో పోటీని తట్టుకుని, ఈ బజ్ తో ‘లైలా’ నిలబడుతుందా? అంటే అనుమానమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×