Manjummel Boys: గతేడాది విడుదలయిన ఎన్నో సినిమాల్లో మలయాళ చిత్రాలు టాప్ స్థానాన్ని దక్కించుకున్నాయి. అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా కేవలం మలయాళ భాషలోనే విడుదలయినా కూడా ఈ సినిమాను చూడడానికి తెలుగు ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లారు. అలా తెలుగు ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్లిన మలయాళ చిత్రాల్లో ‘మంజుమ్మెల్ బాయ్స్’ కూడా ఒకటి. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా, ప్రమోషన్స్ లేకుండా విడుదలయిన ఈ మూవీ బ్లాక్‌బస్టర్ సాధించడంతో పాటు కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోయింది. ఇక ఈ మూవీలో సుభాష్ పాత్రలో తాను నటించాల్సింది అంటూ ఒక నటుడు ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
యాక్టర్ మారాడు
‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) సినిమాలో సుభాష్ అనే పాత్ర చాలా కీలకం. ఆ పాత్రలో శ్రీనాథ్ బాసీ (Sreenath Bhasi) అనే మలయాళ నటుడు నటించాడు. సుభాస్.. గుణ కేవ్స్‌లోని లోయలో పడిపోవడంతోనే అసలు సినిమా మొదలవుతుంది. తమిళనాడులోని చాలావరకు థియేటర్లలో ఈ మూవీ 50 రోజుల పాటు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యింది. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి సౌత్ ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. తమిళ, మలయాళంలోనే కాదు.. తెలుగులో కూడా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. అలా ‘మంజుమ్మెల్ బాయ్స్’లో సుభాష్ రోల్‌లో నటించడానికి ముందుగా అసీఫ్ అలీ పేరును పరిగణనలోకి తీసుకున్నారట మేకర్స్.
Also Read: ఆ సినిమా వల్ల డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను, అప్పుడే నిర్ణయించుకున్నాను.. మీనాక్షి కామెంట్స్
నేనే తప్పుకున్నాను
మాలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్నవారిలో అసీఫ్ అలీ కూడా ఒకరు. ఆయన ఒప్పుకున్నారంటే కచ్చితంగా మూవీలో కంటెంట్ ఉంది అని చాలామంది ప్రేక్షకులు నమ్ముతారు. అలా ఆయనకు చాలా ఫ్యాన్ బేస్ కూడా ఏర్పడింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’లోని సుభాష్ పాత్ర కూడా ముందుగా తన చేతికే వచ్చిందని అసీఫ్ అలీ తాజాగా బయటపెట్టాడు. ‘‘దర్శకుడు చిదంబరం మొదటి సినిమా డిస్కషన్స్‌లో నేను పాల్గొన్నాను. మంజుమ్మెల్ బాయ్స్‌లో గుహలో పడిపోవాల్సింది నేనే. అలా చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత నాకు ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల ఆ మూవీకి నేను భారమవుతానని ఫీలయ్యాను’’ అని రివీల్ చేశాడు అసీఫ్ అలీ.
భారీ లాభాలు
‘మంజుమ్మెల్ బాయ్స్’ ఛాన్స్‌ను అసీఫ్ అలీ మిస్ చేసుకున్నా కూడా శ్రీనాథ్ బాసీ మాత్రం ఆ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచాడు. తన పాత్ర వల్లే సినిమా నిలబడింది అనిపించుకున్నాడు. చిదంబరం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ వంటి ఇతర నటులు కూడా ముఖ్య పాత్రలో కనిపించారు. ముందుగా మలయాళంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ సాధించిన తర్వాత తెలుగులో కూడా దీనిని డబ్ చేశారు. కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.140 కోట్లు సాధించింది. ‘మంజుమ్మెల్ బాయ్స్’లో అవకాశం కోల్పోయిన అసీఫ్ అలీ (Asif Ali).. తాజాగా ‘కిష్కింద కాండం’ అనే మూవీతో అందరినీ అలరించాడు.