BigTV English

Mechanic Rocky Movie Team : మంచి ప్రశ్న అడిగితే గోల్డ్ కాయిన్ ఇస్తారట

Mechanic Rocky Movie Team : మంచి ప్రశ్న అడిగితే గోల్డ్ కాయిన్ ఇస్తారట

Mechanic Rocky Movie Team : ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్‌లో విశ్వక్సేన్ ఒకరు. ‘వెళ్ళిపోమాకే’ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలా మందికి తెలియదు. ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. కేవలం తనలోని నటుడిని మాత్రమే కాకుండా దర్శకత్వ ప్రతిభను కూడా చూపిస్తూ ‘ఫ‌ల‌క్‌నుమాదాస్’ అనే సినిమాను చేశాడు. మలయాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ సాధించింది. అయితే విశ్వక్ ప్రతి సినిమాకు కొద్దిపాటి వివాదం అనేది జరగడం కామన్‌గా వస్తుంది. ఇవన్నీ కూడా కావాలని కాకుండా యాదృచ్ఛికంగా జరుగుతున్నవే అని చెప్పాలి. ఇక ప్రస్తుతం మెకానిక్ రాకి అనే సినిమాను చేస్తున్నాడు విశ్వక్. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూస్ లో పాల్గొంటున్నాడు.


ఇక రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు విశ్వక్. ఈ ఇంటర్వ్యూలో ఒక సీనియర్ జర్నలిస్టు తో మాట్లాడుతూ.. “ముందుగా మీరు తాగుతారా సార్” అని ప్రశ్నించాడు. ఆ తర్వాత “మీడియా ప్రముఖుల అందరికీ కూడా ఒక మంచి పార్టీ పెడుతున్నాము. ఈ పార్టీలో ఒక సర్ప్రైజ్ ఉంది. ఇది ఒక గోల్డెన్ పార్టీ. సినిమాకి సంబంధించి మంచి ప్రశ్నలు అడిగిన వారికి ఒక గోల్డ్ కాయిన్ కూడా ఇద్దామని అనుకుంటున్నాము. దాదాపు ఒక పదిమందికి గోల్డ్ కాయిన్స్ ఇవ్వబోతున్నాం” అంటూ తెలిపాడు విశ్వక్. దీనిని బట్టి ఈ చిత్ర యూనిట్ మంచి స్ట్రాటజీని పట్టుకుంది అనే చెప్పాలి. రీసెంట్ గా జరుగుతున్న ప్రెస్ మీట్ లో డీసెంట్ ప్రశ్నలు ఒకటి కూడా ఉండవు. హీరో యొక్క వ్యక్తిగత విషయాలు, హీరోయిన్ వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ… అసలు సినిమాకు సంబంధంలేని ప్రశ్నలు అడుగుతూ ఉంటున్నారు కొంతమంది మీడియా ప్రముఖులు. ఇక ఈ చిత్ర యూనిట్ ఎటువంటి ప్రశ్నలు ఎదురవుతాయో త్వరలో తెలియనుంది.

Also Read : FreeFire x Pushpa2TheRule : టార్గెట్ ఆడియన్స్ పల్స్ పట్టుకున్నారు


ఇక విశ్వక్ విషయానికి వస్తే చాలా త్వర త్వరగా సినిమాలు చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళుతున్నాడు. విశ్వక్ కెరియర్ లో క్వాంటిటీతో పాటు క్వాలిటీ కూడా చూసుకుంటున్నాడు అని చెప్పాలి. కేవలం ఈ ఒక్క ఇయర్‌లో విశ్వక్ నటించిన మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. చాలా మంది రెండేళ్లకు ఒక సినిమా చేస్తున్న తరుణంలో విశ్వక్ మాత్రం మూడు సినిమాలు చేయటం అనేది గ్రేట్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం విశ్వక్ ‘లైలా’ అనే ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ కి సిద్ధమవుతున్న మెకానిక్ రాకి సినిమా కూడా మంచి సక్సెస్ సాధిస్తుంది అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×