BigTV English

Venkatesh: తొలిసారి ఫ్యామిలీపై స్పందించిన వెంకటేష్.. భార్యపై ఊహించని కామెంట్..!

Venkatesh: తొలిసారి ఫ్యామిలీపై స్పందించిన వెంకటేష్.. భార్యపై ఊహించని కామెంట్..!

Venkatesh:విక్టరీ వెంకటేష్ (Venkatesh).. ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. వచ్చే ఏడాది అనగా 2025 జనవరి 14వ తేదీన ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాలు చేపట్టింది చిత్ర బృందం. అందులో భాగంగానే వెంకటేష్ కూడా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ ఫోర్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ బాలకృష్ణ(Balakrishna) సందడి చేశారు. ఇందులో భాగంగానే సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఇక్కడ పంచుకోవడం జరిగింది. ఇందులో భాగంగానే తొలిసారి ఫ్యామిలీ గురించి, తన భార్య గురించి స్పందించడంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.


నా భార్యే నా బెస్ట్ ఫ్రెండ్..

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో.. సినీ సెలబ్రిటీల కుటుంబాలు సోషల్ మీడియాలో అలాగే పబ్లిక్ ముందు ఎంత యక్టివ్ గా ఉంటారో అందరికీ తెలిసిందే. కానీ వెంకటేష్ మాత్రం తన కుటుంబాన్ని ఏ రోజు కూడా మీడియా ముందుకు తీసుకురాలేదు. కనీసం సినిమా ఫంక్షన్లకు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. అందుకే ఈ కుటుంబం గురించి తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. దీంతో దాదాపు చాలా ఏళ్ల తర్వాత వెంకటేష్ తన ఫ్యామిలీ గురించి ప్రస్తావించడం జరిగింది. ఇక అందులో భాగంగానే “మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?” అని బాలయ్య ప్రశ్నించగా.. వెంకటేష్ మాట్లాడుతూ..” నా భార్య నీరజ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె వల్లే నాకు ఇంకో బెస్ట్ ఫ్రెండ్ అవసరం రాలేదు. ఏమాత్రం సమయం దొరికినా సరే ఆమెతో కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి ఇష్టపడతాను. కలిసి టూర్స్ కి వెళ్తాము. ఆమెతో కలిసి నేను అప్పుడప్పుడు వంటగదిలో గరిట కూడా తిప్పుతుంటాను. అది నాకెంతో నచ్చుతుంది” అంటూ వెంకటేష్ తెలిపారు. ఇక ఫ్యామిలీ హీరో గానే కాకుండా ఫ్యామిలీ మెన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు వెంకీ అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


అలాగే రానా గురించి మాట్లాడుతూ..” చిన్నతనంలో రానా ఎంతో సైలెంట్ గా ఉండేవాడు. నా బెడ్ కింద దూరి సూపర్ హీరో పాత్రల బొమ్మలతో ఎక్కువగా ఆడుకుంటూ తన పనిలో తాను ఉండేవాడు” అంటూ సరదాగా చెప్పుకొచ్చారు వెంకటేష్.

అలాగే నాగచైతన్య గురించి మాట్లాడుతూ.. “నా మేనల్లుడు నాగచైతన్యను హగ్ చేసుకుంటే అది ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. వందమందిని హగ్ చేసుకున్నా.. రాని ఆనందం చైతూని హగ్ చేసుకుంటే వస్తుంది. అదేదో తెలియని ఫీలింగ్” అంటూ నాగచైతన్య గురించి చెప్పుకొచ్చారు వెంకటేష్.

అలాగే తన తండ్రి దివంగత నేత రామానాయుడు, కొడుకు అర్జున్ గురించి కూడా ప్రస్తావించారు. ఇకపోతే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహిస్తూ ఉండగా.. మీనాక్షి చౌదరి (Meenakshi Choudhary),ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh) ఇద్దరూ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ఎఫ్2, ఎఫ్3 సినిమా రాగా ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు సమర్పణలో శిరీష్ దీనిని నిర్మిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×