BigTV English

This Week Theatre And OTT Releases: ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 22 సినిమాలు, సిరీస్‌లు

This Week Theatre And OTT Releases: ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 22 సినిమాలు, సిరీస్‌లు

This Week Theatre And OTT Releases: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో ఏ ఏ చిత్రాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతాయో అని తెలుసుకోవడం కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇందులో భాగంగానే మరో వారం రానే వచ్చింది. ఈ వారం పలు సినిమాలు, సిరీస్‌లు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


థియేటర్ మూవీస్

కమిటీ కుర్రోళ్ళు


యదు వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘కమిటీ కుర్రోళ్లు’. సందీప్‌ సరోజ్, ఈశ్వర్‌ రాచిరాజు, యశ్వంత్‌ పెండ్యాల, త్రినాథ్‌ వర్మ, ప్రసాద్‌ బెహరా ప్రధాన పాత్రల్లో నటించారు. నిహారిక కొణిదెల సమర్పణలో రూపొందుతోంది. పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సింబా

జగపతిబాబు, అనసూయ కీలక పాత్రల్లో నటించిన కొత్త సినిమా ‘సింబా’. ఈ చిత్రానికి మురళీ మనోహర్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. సూపర్‌ నేచురల్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌‌గా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంపత్‌ నంది, దాసరి రాజేందర్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుంది.

తుఫాన్

Also Read: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసిందిరోయ్.. ఎన్టీఆర్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ అంతే

కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా ‘తుఫాన్’. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విజయ్‌ మిల్టన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యరాజ్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని కమల్‌ బోరా, డి.లలిత, బి.ప్రదీప్, పంకజ్‌ బోరా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

భవనమ్‌

బాలాచారి కూరెళ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త సినిమా ‘భవనమ్’. ఇందులో సప్తగిరి, షకలక శంకర్, ధనరాజ్, అజయ్, స్నేహ ఉల్లాల్‌, మాళవిక సతీషన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. సూపర్‌ గుడ్‌ ఫిలింస్‌ సమర్పణలో ఆర్‌.బి.చౌదరి, వాకాడ అంజన్‌ కుమార్, వీరేంద్ర సీర్వి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్టు 9న విడుదల కానుంది.

ఈ కొత్త సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. మహేశ్ బాబు బర్త్ డే సందర్భంగా మురారి మళ్లీ రిలీజ్ కానుంది. అలాగే ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ కలిసి నటించిన ‘సూపర్ డీలక్స్’ కూడా రీరిలీజ్ కానుంది.

ఓటీటీ చిత్రాలు/ సిరీస్‌లు

నెట్‌ఫ్లిక్స్‌

ఆగస్టు 8 – ది అంబ్రెలా అకాడమీ(సిరీస్‌)
ఆగస్టు 9 – కింగ్స్‌మెన్‌ గోల్డెన్‌ సర్కిల్‌(ఇంగ్లీష్‌)
ఆగస్టు 9 – భారతీయుడు2(తెలుగు/తమిళ్‌)
ఆగస్టు 9 – ఫిర్‌ ఆయే హసీనా దిల్‌‌రుబా(హిందీ)
ఆగస్టు 9 – మిషన్‌ క్రాస్‌ (కొరియన్‌)
ఆగస్టు 9 – ఇన్‌సైడ్‌ ది మైండ్‌ ఆఫ్ ది డాగ్‌(ఇంగ్లీష్‌)
ఆగస్టు 10 – రొమాన్స్‌ ఇన్‌ ది హైస్‌(కొరియన్‌)

జీ5

ఆగస్టు 5 – భీమా: అధికార్‌ సే అధికార్‌ తక్‌(హిందీ)
ఆగస్టు 5 – అమర్‌ సంగి (బెంగాలీ)
ఆగస్టు 9 – గ్యారా గ్యారా (హిందీ సిరీస్)

డిస్నీ+హాట్‌స్టార్‌

Also Read: మొన్న జాన్వీ.. నేడు కీర్తి.. హీరోయిన్లందరికీ ఎన్టీఆరే కావాలంట..?

ఆగస్టు 7 – ది జోన్‌:సర్వైవల్‌ మిషన్‌(కొరియన్‌)
ఆగస్టు 8 – ఏఏఏ(హిందీ)
ఆగస్టు 8 – ఆర్‌యూ ష్యూర్‌(కొరియన్‌)
ఆగస్టు 9 – లైఫ్ హిల్‌ గయు (హిందీ సిరీస్)
ఆగస్టు 9 – ఖాటిల్ కౌన్? (సిరీస్)

సోనీలివ్‌

ఆగస్టు 9 – టర్బో (మలయాళం/ తెలుగు)

జియో సినిమా

ఆగస్టు 6 – మేఘ బర్సేంగే (సిరీస్)
ఆగస్టు 9 – గుడ్చడి (సినిమా)

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×