Bollywood : బాలీవుడ్ ఇండస్ట్రీ పై గత కొన్నేళ్లుగా పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రియాంక చోప్రా లాంటి స్టార్ హీరోయిన్ సైతం బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా ఒక్కొక్కరు బాలీవుడ్ లో జరుగుతున్న అన్యాయాల గురించి బయట పెడుతున్నారు. అయితే ఇలాంటి వ్యాఖ్యలపై బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. ఇప్పటికే ఎన్నో విమర్శలు అందుకుంటున్న బాలీవుడ్ ఇండస్ట్రీపై తాజాగా ఓ నటుడు సంచలన వ్యాఖ్యలు చేశాడు. వీడియోను రిలీజ్ చేస్తూ నాకు అన్యాయం జరిగిందంటూ కన్నీళ్లు పెట్టుకుని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలోను, మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ నటుడు ఏమన్నాడో ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఫేక్..
బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుమారుడు బాబిల్ ఖాన్.. తాజాగా కన్నీళ్లు పెట్టుకుంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న బాగోతల గురించి ఆ వీడియోలో నటుడు బయట పెట్టాడు. వీడియో వైరల్ అవడంతో కొద్ది నిమిషాల్లోనే డిలీట్ చేశాడు. అందులో మాట్లాడుతూ..బాలీవుడ్ ఇండస్ట్రీ ఓ మర్యాద లేని పరిశ్రమ అని.. ఫేక్ ఇండస్ట్రీ అని బాబిల్ వీడియోలో చెప్తూ ఎమోషన్ అయ్యారు. హిందీ చిత్ర పరిశ్రమలో ఉండే ఇబ్బందులు, పలువురు యాక్టర్స్పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. అర్జున్ కపూర్, షనయా కపూర్, అనన్య పాండే వంటి వారి తీరును ఎండగట్టారు. పని చేయడానికి బాలీవుడ్ మంచి ప్లేస్ కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. కేవలం కొందరికి మాత్రమే ఇక్కడ లైఫ్ ఉంటుంది. చిన్న వాళ్లను పట్టించుకోరు అని అన్నాడు. ఇండస్ట్రీ ఎంతో అమర్యాదకరంగా ఉంటుంది. ఇప్పటివరకూ నేను చూసిన వాటిల్లో నకిలీ పరిశ్రమ ఇదే. ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకునే వారు కొంతమంది మాత్రమే ఉంటారు. నేను మీకు ఎన్నో విషయాలు తెలియజేయాలని అనుకుంటున్నా అని వీడియోలో కన్నీళ్లు పెట్టుకున్నాడు.
Also Read:బాక్సాఫీస్ ఊచకోత.. మరో రికార్డ్ బ్రేక్ చేసిన ‘హిట్ 3’..
వీడియోను డిలీట్ చెయ్యడం పై అనుమానాలు..?
బాలీవుడ్ ఇండస్ట్రీపై ఎండగడుతూ బాబిల్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో క్షణాల్లోనే వైరల్ అయిపోయింది. అయితే వీడియోలన్నింటినీ డిలీట్ చేసి.. తన ఇన్ స్టా అకౌంట్ను సైతం డీయాక్టివేట్ చేశారు. దీనిపై నెటిజన్లు ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్లో ఆయన్ను ఎవరో తీవ్రంగా ఇబ్బంది పెట్టారని అర్థమవుతుంది. అయితే ఇప్పటివరకు అతని వీడియో గురించి బాలీవుడ్ ప్రముఖులు ఎక్కడ ప్రస్తావించలేదు కానీ ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఈ టాపిక్కు హాట్ టాపిక్ అయిపోయింది. త్వరలోనే బాలీవుడ్ పెద్దలు స్పందించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇర్ఫాన్ ఖాన్ ఎంత పెద్ద నటుడో అందరికీ తెలుసు. ఆయన మరణాన్ని తెలుగు ప్రేక్షకులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. అలాంటి గొప్ప నటుడు కొడుకుకి ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది..