Simran Singh.. ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు తీవ్ర మనస్థాపానికి గురై.. ఆత్మహత్యలు చేసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఆర్జేగా గుర్తింపు తెచ్చుకున్న సిమ్రాన్ సింగ్ (Simran Singh) ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ప్రముఖ రేడియో జాకీగా పేరు దక్కించుకున్న సిమ్రాన్ సింగ్ గురుబ్రామ్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయం తెలియడంతో సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న గురుగ్రాం పోలీసులు ఆమె మృతదేహాన్ని స్వాధీన పరుచుకొని దర్యాప్తు చేపట్టారు.
సొంత ఫ్లాట్లో ఉరి వేసుకున్న సిమ్రాన్ సింగ్.
ఇంస్టాగ్రామ్ లో ఈమెకు సుమారుగా 6 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇంతకుముందు ప్రముఖ రేడియో జాకీగా పనిచేసిన ఈమె ఇప్పుడు ఫ్రీ లాన్సర్ గా పని చేస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సిమ్రాన్ తన సొంత ఫ్లాట్లోనే బుధవారం రోజు మరణించింది. ఫ్లాట్ లో ఉరి వేసుకొని బలవన్మరణం పొందినట్టు ప్రాథమిక విచారణలో పోలీసులు తేల్చారు. వేలాడుతున్న మృతదేహాన్ని పోలీసులు కిందికి దింపి ప్రస్తుతం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలుస్తోంది. సిమ్రాన్ సింగ్ జమ్మూ నివాసి. స్నేహితురాలితో కలిసి ఇక్కడే నివాసిస్తోందని పోలీసులు కూడా తెలిపారు.
ఆర్జేగా భారీ పాపులారిటీ..
సిమ్రాన్ విషయానికొస్తే..ఆర్జె సిమ్రాన్ రేడియో జాకీ గా ప్రపంచంలోనే మంచి ప్రసిద్ధి చెందింది. ప్రజలు ఈమె స్వరాన్ని పిచ్చిగా ఇష్టపడతారు అనడంలో సందేహం లేదు. తన అభిమానుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈమె ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేది. కానీ నిన్న గురుగ్రామ్ లోని సెక్టార్ 47లో ఉన్న ఫ్లాట్లో ఉరి వేసుకొని మరణించింది. ఇక ప్రస్తుతం ఈమె మరణానికి గల కారణాలను పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో సిమ్రాన్ సింగ్ చివరి పోస్ట్..
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సిమ్రాన్ ఇలా మరణించింది అని తెలియగా అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇన్స్టాగ్రామ్ లో ఆమె చేసిన చివరి పోస్ట్ ఏంటి? అంటూ కూడా తెగ వెతికేస్తున్నారు. అందులో భాగంగానే ఆమె చివరి పోస్ట్ ఒక వీడియో.. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఆ వీడియోలో ఆర్జె సిమ్రాన్.. ” నేనంటే మీకు ఇష్టం.. కానీ మీరు అలా అనరు. మీ మాటలకు నేను ఎంతో నవ్వుకుంటాను. కానీ తెలిసిన తర్వాత నేను నవ్వను.. నన్ను ఛాన్స్ తీసుకోనవసరం లేదు”.. అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. ఇక ఈ పోస్ట్ చూసిన ఆమె అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. ఈ వీడియో పై కామెంట్ చేస్తూ ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు. ఏది ఏమైనా రేడియో జాకీగా తన స్వరంతో శ్రోతలను అలరించిన సిమ్రాన్ సింగ్ ఇలా అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి సిమ్రాన్ మృతికి గల కారణాలు ఏమిటి? అసలు ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది..? దీని వెనుక ఎవరి ప్రమేయమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.