SSMB29: అందరి సినిమాలు వస్తున్నాయి.. ఆర్ఆర్ఆర్ వచ్చి మూడేళ్లు దాటింది. అందులో నటించిన హీరోల సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇంకా ఆర్ఆర్ఆర్ ను తెరకెక్కించిన డైరెక్టర్ రాజమౌళి మాత్రం తన తదుపరి సినిమాను పట్టాలెక్కించలేదు. అదుగో అప్పుడు.. ఇదుగో ఇప్పుడు అని చెప్పుకుంటూనే వస్తున్నాడు కానీ.. ఎప్పుడెప్పుడు SSMB29 ను పట్టాలెక్కిస్తాడా.. ? అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న కాంబో మహేష్ బాబు- రాజమౌళి. ఇన్నాళ్లకు ఆ కాంబో సెట్ అయ్యింది.
మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంపై అభిమానులు మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం భారీ అంచనాలను పెట్టుకుంది. గుంటూరు కారం సినిమా తరువాత మహేష్.. తన టైమ్ మొత్తాన్ని జక్కన్న చేతిలో పెట్టేశాడు. అమెజాన్ అడవులను బ్యాక్‌డ్రాప్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మూడేళ్ళుగా ఈ సినిమా కథ కోసమే జక్కన్న చాలా వర్క్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ను ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు. ఇంకోపక్క మహేష్.. ఈ సినిమా కోసం లుక్ ను మొత్తం మార్చేశాడు.
Game Changer: గేమ్ ఛేంజర్.. ప్లస్ లు మైనస్ లు ఇవే.. ?
SSMB29 గురించి ఎలాంటి వార్త .. అది నిజం కాకపోయినా కూడా సోషల్ మీడియా మొత్తం షేక్ చేస్తుంది. SSMB29 లో హాలీవుడ్ హీరోయిన్ నటిస్తుందని, బాలీవుడ్ హీరో విలన్ గా చేస్తున్నాడని.. ఇలా రకరకాల పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఇక వీటికి ఫుల్ స్టాప్స్ ఉండవు.. జక్కన్న అధికారికంగా ప్రకటించేవరకు కామాలు మాత్రమే ఉంటాయి. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా అమెరికా కోడలు ఫిక్స్ అయ్యింది. మొన్నటివరకు హాలీవుడ్ బ్యూటీ అని టక నడిచినా చివరకు బాలీవుడ్ బ్యూటీనే ఫిక్స్ చేశారట. ఆమె ఎవరో కాదు గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా.
ఇక ఈ చిన్నది కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనకంటే చిన్నవాడైన నిక్ జోనస్ ను వివాహమాడి అమెరికా కోడలిగా వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లి హాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది. అప్పుడప్పుడు బాలీవుడ్ లో మెరుస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు SSMB29 తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుందట. ఎప్పటినుంచో ఈ వార్తలు వినిపిస్తున్నా.. ఇది కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి.
Vidaamuyarchi First Single: అజిత్ స్టైల్.. అనిరుధ్ మ్యూజిక్.. డెడ్లీ కాంబో అబ్బా.. అదిరిపోయింది అంతే
ఇక ప్రియాంకతో పాటు.. SSMB29 లో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. సలార్ సినిమాతో పాన్ ఇండియా నటుడుగా మారిన మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. నిజం చెప్పాలంటే .. పృథ్వీరాజ్ సుకుమారన్ చాలా మంచి నటుడు. జక్కన్నకు అలాంటి నటులను ఎలా వాడుకోవాలో బాగా తెలుసు. ఇక దీంతో మహేష్ సినిమా అంటే ఆ మాత్రం లేకపోతే ఎలా అని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ఇక SSMB29 ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. క్యాస్టింగ్ అప్డేట్ ను మేకర్స్ త్వరలోనే ఇవ్వనున్నారు. మరి ఈ సినిమాతో జక్కన్న ఎలాంటి రికార్డులను తిరగరాస్తాడో చూడాలి.