BigTV English

Bagheera Trailer: పాపాలు కడిగే టైమొచ్చింది.. యాక్షన్ సీక్వెన్స్ తో..!

Bagheera Trailer: పాపాలు కడిగే టైమొచ్చింది.. యాక్షన్ సీక్వెన్స్ తో..!

Bagheera Trailer.. కన్నడ ఫిలిం ఇండస్ట్రీ నుండి మరో యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యింది. ఏకంగా జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ శాండిల్ వుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేజిఎఫ్(KGF ), సలార్ (Salaar) సినిమాలతో తెలుగులో కూడా బోలెడు మార్కెట్ క్రియేట్ చేసుకున్న ప్రశాంత్ నీల్, ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR) కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డైరెక్టర్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న ప్రశాంత్ నీల్ భఘీర (Bagheera)అనే సినిమాకి కథ అందించారు. తాజాగా ఈ సినిమా నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది.


భఘీర ట్రైలర్ లాంచ్..

శ్రీ మురళి (Sri Murali), రుక్మిణి వసంత్ (Rukmini vasanth) జంటగా నటించిన ఈ చిత్రానికి కేజీఎఫ్, సలార్ చిత్రాలను భారీ బడ్జెట్ తో నిర్మించిన హోం భలే ఫిలిమ్స్ (Hombale films) వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్ తో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి డాక్టర్. సూరి (Dr.Suri) డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ముసుగు వేసుకొని విలన్ లను చంపడం లాంటి సన్నివేశాలు కేజీఎఫ్ చిత్రాన్ని గుర్తుచేస్తోంది అని చెప్పవచ్చు. చిన్నపిల్లవాడు తన తల్లి చనిపోయిన తర్వాత పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని ముసుగు వేసుకొని భఘీర గెటప్ లో విలన్ లని చంపుతూ ఎవరికి అంతు చిక్కకుండా ముసుగు గెటప్ లోనే విలన్లకు చమటలు పట్టిస్తూ ఉంటారు. ఇన్ని హత్యలు చేస్తున్న భఘీరా ను చివరికి పోలీసులు పట్టుకున్నారా? లేదా ?అనేది తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే అన్నట్టుగా ఇందులో వెల్లడించారు. పాపాలు కడిగే టైం వచ్చింది.. రక్తం తాగే రాక్షసుడు.. అంటూ ట్రైలర్లో అదిరిపోయే డైలాగులు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. మరోసారి కేజీఎఫ్ రేంజ్ లో ఈ సినిమా సక్సెస్ అవుతుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీనికి తోడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాకు అదిరిపోయింది.


దీపావళి బరిలో పోటీకి దిగుతున్న భఘీర..

కన్నడ తో పాటు తెలుగులో కూడా దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా . ఇకపోతే ఇప్పటికే లక్కీ భాస్కర్ , కిరణ్ అబ్బవరం క లాంటి తెలుగు స్ట్రెయిట్ సినిమాలతో పాటు అమరన్ అనే డబ్బింగ్ సినిమా కూడా విడుదల కాబోతోంది ఇప్పుడు ఈ చిత్రాలకు పోటీగా కన్నడ ఫిలిం భఘీర కూడా విడుదల కాబోతోంది. మరి ఇన్ని సినిమాల మధ్య ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి అంటే దీపావళి వరకు ఎదురు చూడాల్సిందే.

సినిమాపై హైప్ పెంచిన ట్రైలర్..

ఈ ట్రైలర్ ద్వారా సినిమాకు కొంచెం కలిసొచ్చేలా కనిపిస్తోంది. ఈ సెటప్ చూస్తుంటే కేజిఎఫ్ , సలార్ సినిమాలే గుర్తుకొస్తున్నాయి. ప్రశాంత్ నీల్ కథలలో యాక్షన్ తో పాటు ఎమోషన్ కూడా అదిరిపోయేలా డిజైన్ చేశారనే నమ్మకం ట్రైలర్ కలిగించింది. నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి. ప్రశాంత్ నీల్ పై ఉన్న ఇమేజ్ ఈ సినిమాకు ఒకరకంగా ప్లస్ కావచ్చు. అలాగే సలార్ సినిమాకి ,ఉగ్రం కథకి పోలికలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు రాగా.. దాంతో కన్నడ ఉగ్రం సినిమాపై ప్రభాస్ అభిమానులు ఫోకస్ చేశారు. అలా ఆ సినిమా హీరో మురళి, ప్రభాస్ అభిమానులకు బాగా పరిచయమయ్యాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో రాబోతుండడం తో ప్రభాస్ అభిమానులలో కూడా మురళి పై అంచనాలు ఏర్పడ్డాయి. మొత్తానికైతే కన్నడ నుంచి మరో బ్లాక్ బాస్టర్ రాబోతోందని అయితే స్పష్టం అవుతోంది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×