Balagam Venu: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో.. ఎవరి జీవితం ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్న నటుల్లో వేణు ఒకరు. వేణు వండర్స్ అనే టీమ్ తో ఎంతమంది ప్రేక్షకులను తమ స్కిట్స్ తో నవ్వించాడు. అటుపక్క జబర్దస్త్.. ఇటు పక్క సినిమాల్లో కూడా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. అలా కమెడియన్ గా కొనసాగుతున్న సమయంలోనే ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించాడు.
దిల్ రాజు కూతురు హన్షిత నిర్మించిన బ్యానర్ లో బలగం అనే సినిమాకు వేణు దర్శకత్వం వహిస్తున్నాడు అని చెప్పగానే.. చాలామంది నవ్వారు. కమెడియన్ వేణు ఏంటి.. డైరెక్టర్ గా మారడం ఏంటి. మంచిగా కమెడియన్ గా సెటిల్ అవ్వొచ్చు కదా.. ఇలాంటివి చేసి చేతులు కాల్చుకోవడం ఎందుకు అంటూ పెదవి విరిచారు. ఇక వేణు ఇలాంటివేమీ పట్టించుకోకుండా ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ జంటగా బలగం సినిమాను తెరకెక్కించాడు.
Daaku Maharaaj Release Trailer: యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టేసిన బాలయ్య..!
చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. రికార్డ్ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమా తరువాత ఓవర్ నైట్ లో వేణు స్టార్ డైరెక్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయాడు. న్యాచురల్ స్టార్ నానినే పిలిచి వేణుకు సెకండ్ సినిమా ఆఫర్ ను అందించాడు. దిల్ రాజు బ్యానర్ లోనే నానితో వేణు ఎల్లమ్మ అనే సినిమాను మొదలుపెట్టాడు. అయితే కొన్ని కారణాల వలన ఎల్లమ్మ నుంచి నాని బయటకు వచ్చాడు. న్యాచురల్ స్టార్ పోతేనేం ఆయన పల్స్ లోకి మరో కుర్ర హీరో నితిన్ వచ్చి చేరాడు. ఈ సినిమా కూడా గ్రామీణ నేపథ్యంలోనే తెరకెక్కనుందని టాక్.
ఇక బలగం హిట్ తో స్టార్ డైరెక్టర్ గా మారిన వేణు.. అప్పుడప్పుడు యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. తాజాగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కాకమ్మ కథలు అనే టాక్ షోకు తన ఫ్రెండ్ ధనరాజ్ తో పాల్గొని సందడి చేశాడు. అందాల ముద్దుగుమ్మ తేజస్వి మదివాడ .. ఈ ఇద్దరు ఫ్రెండ్స్ తో ఒక ఆట ఆడుకుంది. వారి జీవితాల్లో జరిగిన ప్రతి మూమెంట్ గురించి చెప్పుకొచ్చారు.
Ketika Sharma : క్యూట్ స్మైల్ తో కుర్రకారు మతి పోగొడుతున్న కేతికా శర్మ
ఇక ఇందులో భాగంగానే ఇప్పటివరకు మీ జీవితంలో రాంగ్ స్టెప్ తీసుకున్నాను అనిపించినా మూమెంట్ ఏంటి అని తేజస్వి అడుగగా.. వేణు ” జబర్దస్త్ మానేయడం” అని చెప్పుకొచ్చాడు. అంటే డైరెక్టర్ గా మరకముందే వేణు ఈ షో నుంచి వచ్చేశాడు. దీని వలన వేణు చాలా నష్టపోయాయడు అని చెప్పుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
ఇకపోతే ధనరాజ్ విషయానికొస్తే.. ఈ మధ్యనే అతను కూడా డైరెక్టర్ గా మారాడు. రామంరాఘవం అనే సినిమాతో దర్శకుడుగా కొత్త అడుగు వేశాడు. సముద్రఖని, ధనరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా వచ్చే నెల రిలీజ్ కానుంది. మరి ఫ్రెండ్ వేణులా ధనరాజ్ కూడా మొదటి సినిమాతో హిట్ ను అందుకుంటాడో లేదో చూడాలి.