Smartwatch : స్మార్ట్‌వాచ్‌లలో లేటెస్ట్ టెక్నాలజీని UK బ్రిస్టల్ విశ్వవిద్యాలయంలోని టీమ్ పరిచయం చేసింది. ఈ టెక్నాలజీ ధూమపానం మానేయడంలో సహాయపడుతుందని, సిగరెట్ వినియోగిస్తున్నట్లు సూచనలు కనిపిస్తే గుర్తించి హెచ్చరిస్తుందని తెలిపింది.
ప్రముఖ బ్రిస్టల్ యూనివర్సిటీ స్మార్ట్‌వాచ్‌లలో లేటెస్ట్ టెక్నాలజీతో పనిచేసే సరికొత్త యాప్ ను తీసుకువచ్చింది. ఈ యాప్ ధూమపానం చేసిప్పుడు సాధారణ చేతి కదలికలను గుర్తించి.. స్మార్ట్‌వాచ్‌లో మోషన్ సెన్సార్‌లను యాక్టివేట్ చేస్తుంది. దీంతో స్మోకింగ్ చేస్తున్నప్పుడు గతంలో స్మోకింగ్ చేసేవారు చెప్పిన సందేశాలను చూపిస్తూ స్క్రీన్ ను వైబ్రేట్ చేస్తుంది. స్మోకింగ్ ఆపమంటూ ఇన్స్ట్రక్షన్స్ సైతం అందిస్తుంది. స్మోకింగ్ ఆపేస్తే మీరు మరింత తెేలికగా ఊపిరి పీల్చుకోవచ్చు అని.. ఇప్పటికిప్పుడే మానేయడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుపుతుంది. అంతేకాకుండా ఈ రోజులో ఎన్ని సిగరెట్స్ తాగారు.. వాటి వల్ల కలిగే అనర్ధాలు ఏంటో కూడా వివరిస్తుంది. ఆపై దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆన్లైన్లో చూడటానికి మీరు యాక్సెస్ చేయవచ్చు. అవసరం లేదు అనుకుంటే స్వైప్ చేయవచ్చు.
ధూమపానాన్ని వదిలేయటానికి ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తారని కానీ ఈ విషయాన్ని వదలలేక ఇంకా ఎన్నో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది. అంతేకాకుండా ఎక్కువ మంది ఉపయోగించే స్మార్ట్ వాచెస్ లో ధూమపానానికి సంబంధించిన సందేశాన్ని అందించడం మరింత మందికి చేరే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ఎవరైతే నిజంగా మానేయ్యాలనుకుంటూ మానేయలేకపోతారో ఆ లోపాన్ని గుర్తించి సరైన సమయంలో ఈ సెన్సార్ పనిచేస్తుందని.. దీని వల్ల మరిన్ని మెరుగైన ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా సరికొత్త ఆలోచనలు ముందుకు తీసుకువచ్చామని, తక్కువ ధరలోనే బెస్ట్ ఫీచర్స్ అందజేసే స్మార్ట్ వాచెస్ తో ఈ యాప్ పనిచేస్తుందని దీంతో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలిపింది.
ఇప్పటికే ఈ విషయంపై పలువురిపై అధ్యయనం జరిపామని.. ఉదయం లేచిన దగ్గర్నుంచి నిద్రపోయే వరకూ చేసే ప్రతి పనిని గమనిస్తే ఎన్నో ప్రయోజనాలు వచ్చాయని ఈ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. స్మోకింగ్ మానేయడానికి ఈ వాచ్ సందేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని.. సెన్సార్ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పొగ తాగాలనే ఆలోచన తగ్గుతుందని తెలిపారు. ఆరోగ్యం సైతం మరింతగా మెరుగుపడిందని, పూర్తి స్థాయిలో వినియోగిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఈ రీసర్చ్ లో పాల్గొన్న పలువురు తెలిపారు. ఇక దీర్ఘకాలికంగా ఈ యాప్ లో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని.. మరింత మెరుగైన ఫలితాలు సైతం తీసుకువస్తామని బ్రిస్టల్ ఇన్స్టిట్యూట్ సైతం తెలిపింది.
ఇక ఇప్పటికే స్మోకింగ్ ఆపటానికి ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చినప్పటికీ దీనికి బానిసైన వారు అంత తేలిగ్గా మార్చుకోలేకపోతున్నారు. దీంతో పలు రీసెర్చ్ సంస్థలు మరెన్నో ప్రయోజనాలు అందిస్తూ లేటెస్ట్ యాప్స్ ను తీసుకొస్తున్నాయి. వీటిలో అధునాతన టెక్నాలజీని సైతం అందిస్తున్నాయి. మరి వీటి వల్ల పూర్తిస్థాయి ప్రయోజనాలు ఎలా ఉంటాయో ముందు ముందు చూడాలి.
ALSO READ : జియో నుంచి 5.5G సేవలు.. 5G కంటే మెరుగైన ప్రయోజనాలతో!