Balagam venu: కమెడియన్ వేణు.. ఒకప్పుడు ఈ పేరు వింటే పెదాలపై చిరునవ్వు వచ్చేది. కానీ, ఇప్పుడు ఈ పేరు వింటే ఆయన తెరకెక్కించిన బలగం సినిమా గుర్తుకు వస్తుంది. జబర్దస్త్ లో ఒక టీం లీడర్ గా ప్రేక్షకులను నవ్వించిన వేణు.. దిల్ రాజు కూతురు హన్షిత నిర్మించిన బ్యానర్లో బలగం అనే సినిమాను తెరకెక్కించారు. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి బలగం సినిమాని అనౌన్స్ చేసినప్పుడు చాలామంది నవ్వుకున్నారు. డబ్బులు ఎక్కువయ్యి హర్షిత సినిమా తీస్తుంది అని,అట్టర్ ప్లాప్ అని విమర్శలు వెలివెత్తాయి.
అయినా కూడా ఇలాంటి విమర్శలను పట్టించుకోకుండా బలగం సినిమాను నిర్మించారు. చిన్న సినిమాగా బలగం ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తండ్రి కొడుకుల మధ్య బంధం, అన్నాచెల్లెళ్ల మధ్య ఉండే ప్రేమ, అన్నదమ్ముల మధ్య అనుబంధం ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు.
ప్రతి గ్రామంలో ఉండే అనుబంధాల గురించి ఎంతో హృద్యంగా వేణు కథ చెప్పిన విధానానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చిన్న సినిమాగా తెరకెక్కిన బలగం భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు రికార్డు కలెక్షన్స్ రాబట్టాయి.
కేవలం రికార్డ్స్ తో పాటు కూడా అవార్డ్స్ కూడా అందుకున్న ఈ సినిమా తర్వాత వేణు స్టార్ డైరెక్టర్లో లిస్ట్ కి చేరిపోయాడు. బలగం హిట్ తో తంతే బూర్ల బుట్టలో పడ్డట్టు రెండో సినిమానే నానిని డైరెక్ట్ చేసే ఛాన్స్ పట్టేశాడు. దిల్ రాజు బ్యానర్ లో నాని హీరోగా ఎల్లమ్మ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ, ఎల్లమ్మ లైన్ విన్న నాని ఓకే అన్నాడు కానీ , పూర్తీ కథ విన్నాకా నో అనేశాడు. దీంతో ఆ కథ చివరికి నితిన్ వద్దకు చేరింది.
Janhvi Kapoor: చెల్లి సినిమాకు అక్క రివ్యూ.. దాంతో పాటు స్వీట్ వార్నింగ్ కూడా..
నితిన్ హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనుంది. తాజాగా ఈ సినిమా గురించి వేణు ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక రెండు ఫోటోలను షేర్ చేశాడు. జిమ్ లో చెమటలు చిందిస్తున్న ఫోటోలను షేర్ చేస్తూ.. సిద్దమవుతున్నా.. త్వరలో అప్డేట్ ఇస్తాను అని క్యాప్షన్ పెట్టాడు.
ఇక ఈ లుక్ లో యమా సీరియస్ గా కనిపించాడు వేణు . కండలు చూపిస్తూ సీరియస్ లుక్ లో కనిపించేసరికి విలన్ అనుకున్నామని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఏమన్నా విలన్ గా కూడా ఎంట్రీ ఇస్తున్నావా.. ఆ లుక్ ఏంటి.. ఆ కండలు ఏంటి ? అంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమాతో వేణు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.