BigTV English

Janhvi Kapoor: చెల్లి సినిమాకు అక్క రివ్యూ.. దాంతో పాటు స్వీట్ వార్నింగ్ కూడా..

Janhvi Kapoor: చెల్లి సినిమాకు అక్క రివ్యూ.. దాంతో పాటు స్వీట్ వార్నింగ్ కూడా..

Janhvi Kapoor: మామూలుగా సినీ పరిశ్రమలో ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేయడం, ప్రమోట్ చేయడం, పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం.. ఇదంతా కామన్. అది కూడా ఒకే ఫ్యామిలీ నుండి వచ్చిన నటీనటుల సినిమాలు విడుదలయితే ఆ సపోర్ట్ వేరే లెవెల్‌లో ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ కల్చర్ చాలా ఎక్కువ. ఒకే ఫ్యామిలీకు చెందిన నటీనటుల సినిమాలు విడుదల అవుతున్నాయంటే మిగతా వారంతా వాటిని ప్రమోట్ చేయడానికి చాలా సమయాన్ని కేటాయిస్తారు. ప్రస్తుతం జాన్వీ కపూర్ కూడా అదే చేస్తోంది. తన చెల్లెలు ఖుషి కపూర్ డెబ్యూ సినిమాను సరిపడా ప్రమోట్ చేయడంతో పాటు ఒక స్పెషల్ రివ్యూను కూడా షేర్ చేసింది జాన్వీ.


స్పెషల్ రివ్యూ

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాళ్లుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు జాన్వీ కపూర్, ఖుషి కపూర్ (Khushi Kapoor). ఇప్పటికే జాన్వీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తనపై ఉన్న నెగిటివిటీని కొంచెంకొంచెంగా తగ్గించుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఇప్పుడు ఖుషి కపూర్ వంతు. ఇప్పటికే ‘ది ఆర్చీస్’ అనే వెబ్ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఖుషి. కానీ అది థియేటర్లలో విడుదల అవ్వకపోవడం వల్ల ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అవ్వలేదు. ఇక ఫిబ్రవరి 7న ఖుషి కపూర్ డెబ్యూ మూవీ అయిన ‘లవ్‌యాపా’ (Loveyapa) థియేటర్లలో సందడి చేయనుంది. అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ కూడా దీంతో హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు. తాజాగా ఈ మూవీకి జాన్వీ కపూర్ తన స్టైల్‌లో రివ్యూ అందించింది.


ఏడిస్తే చూడలేను

‘నా ఖుషు రొమాంటిక్ సినిమాలను తీసుకొస్తుంది. నీకు నచ్చిన విషయం కోసం నిజాయితీతో కష్టపడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది ఖుషు. రేపటి నుండి మీ అభిమాన థియేటర్లలో లవ్‌యాపా విడుదల కానుంది. ఇది ఫన్, నవ్వులు, ఎనర్జీ, కాస్త ఎమోషన్స్‌తో కూడిన క్యూట్ రొమాంటిక్ కామెడీ చిత్రం. నా ఖుషు ఏడిస్తే చూడలేను కాబట్టి నేను కూడా ఏడ్చేశానేమో’ అంటూ ‘లవ్‌యాపా’కు రివ్యూ ఇస్తూ దానిని ప్రమోట్ చేసింది జాన్వీ కపూర్. అంతే కాకుండా ‘లవ్‌యాపా’ అనే టైటిల్‌తో, తన చెల్లెలి ఫోటోతో ఉన్న టీషర్ట్ వేసుకొని క్యూట్ ఫోటోలు దిగి వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ రివ్యూ చివర్లో తన చెల్లెలికి స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చింది జాన్వీ.

Also Read: శోభితా హీరోయిన్‌గా నటించిన సినిమాల్లో నాగచైతన్య ఫేవరెట్ ఏంటో తెలుసా.?

అలా చేయాల్సిందే

‘నా సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు నా ఫేస్ ఉన్న టీషర్ట్స్ కూడా నువ్వు వేసుకోవాల్సిందే’ అంటూ తన చెల్లెలు ఖుషి కపూర్‌ను ఆర్డర్ చేసింది జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ఇప్పటికే దీనికి స్పెషల్ ప్రీమియర్స్ ఏర్పాటు చేసి బాలీవుడ్‌లో పలు స్టార్ సెలబ్రిటీలను పిలిచి మరీ ఈ సినిమాను చూపించారు మేకర్స్. ఆ స్పెషల్ ప్రీమియర్స్‌ను చూసిన వారంతా చాలావరకు ఈ మూవీ చాలా బాగుందని పాజిటివ్ రివ్యూలు అందిస్తున్నారు. తమిళ, తెలుగులో సూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’కు రీమేక్‌గా తెరకెక్కింది ‘లవ్‌యాపా’.

Related News

Free Pickle Offer: ఈ ఛాలెంజ్ క్లియర్ చేస్తే పికిల్ ప్యాకెట్ ఫ్రీ… పచ్చళ్ళ అక్క బంపర్ ఆఫర్?

Deepthi Sunaina: బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ మాజీ లవర్.. సక్సెస్ రేటెంత?

YouTuber Armaan Malik: ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు.. ఆ యూట్యూబర్‌కు కోర్టు నోటీసులు

Kissik talks show : యాంకర్ సౌమ్య జీవితంలో అన్నీ కష్టాలే.. ఆ హీరో టార్చర్ తో కన్నీళ్లు..

Big TV Kissik Talks : ఇండస్ట్రీలో హార్డ్ వర్క్ పనికిరాదు, చాలామంది ఆ పని చేసి వచ్చారు

Big TV Kissik Talks : ఆ హీరోయిన్ కారుతో గుద్దింది, నేను చాలా పోగొట్టుకున్నాను 

Big Stories

×