BigTV English

Surveyor Jobs: డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హతతో DCIL, వైజాగ్‌లో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే..

Surveyor Jobs: డిగ్రీ, డిప్లొమా, బీటెక్ అర్హతతో DCIL, వైజాగ్‌లో ఉద్యోగాలు.. లాస్ట్ డేట్ ఇదే..

Surveyor Jobs: డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. వైజాగ్ లోని సీతమ్మదారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు అందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. మరీ ఆలస్యం చేయకుండా వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి ఆల్ ది బెస్ట్. ఫిబ్రవరి 25వ తారీఖున దరఖాస్తు గడువు ముగియనుంది.


నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విశాఖపట్నంలోని సీతమ్మధారలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DCIL).. కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 22


ఇందులో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కన్సల్టెంట్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఫర్ ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్, హైడ్రో గ్రాఫిక్ సర్వేయర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్(ఓ/పీ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కన్సల్టెంట్, లీగల్ కన్సల్టెంట్, రెసిడెంట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

పోస్టుల వారీగా..

కన్సల్టెంట్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్: 04

ప్రాజెక్టు మేనేజర్‌ ఫర్‌ ఇన్‌ల్యాండ్‌ డ్రెడ్జింగ్ వర్స్క్‌: 01

హైడ్రోగ్రాఫిక్‌ సర్వేయర్‌: 12

ప్రాజెక్టు కన్సల్టెంట్ (ఓ/పీ): 02

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ కన్సల్టెంట్: 01

లీగల్‌ కన్సల్టెంట్: 01

రెసిడెంట్ మేనేజర్‌: 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లమా, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంబీఏ పాసై ఉంటే సరిపోతుంది. వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు వయస్సు 45 నుంచి 60 ఏళ్లు మించి ఉండరాదు.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ఇన్ ల్యాండ్ డ్రెడ్జింగ్ పోస్టులకు, కన్సల్టెంట్ పోస్టులకు నెలకు రూ.1,50,000 – రూ.2,00,000 జీతం ఉంటుంది. ఇన్‌ల్యాండ్ డ్రెడ్జింగ్ వర్క్స్ ప్రాజెక్ట్ మేనేజర్, రెసిడెంట్ మేనేజర్ పోస్టులకు రూ.50,000-రూ.65,000 జీతం ఉంటుంది. హైడ్రోగ్రాఫిక్ సర్వేయర్ పోస్టులకు రూ.25,000-రూ.40,000 జీతం ఉంటుంది. ఇతర పోస్టులకు రూ.1,00,000 – రూ.1,20,000 జీతం  ఉంటుంది. లీగల్ కన్సల్టెంట్ పోస్టులకు రూ.50,000- రూ.70,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ విధానం: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోవాలి.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

దరఖాస్తు కు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25

Also Read: TG Ed.CET: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. పీఈ సెట్, ఎడ్‌సెట్ షెడ్యూల్ వచ్చేసింది..

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.dredge-india.com/

అర్హత ఉన్న అభ్యర్థులందరికీ ఇదే మంచి అవకాశం. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసుకోవచ్చు. వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×