Daaku Maharaj:ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby kolli) దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన చిత్రం ‘డాకు మహారాజ్’ సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను శ్రీకర స్టూడియో సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మేకర్స్ ముందు నుంచే చాలా కాన్ఫిడెన్స్ తో ఉండగా.. రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకు అదే రిజల్ట్ వచ్చింది. అయితే ఈ సినిమాను కేవలం తెలుగు ప్రేక్షకుల ముందుకే కాకుండా హిందీ ఆడియన్స్ ముందుకి కూడా తీసుకొచ్చే పనులు మొదలుపెట్టారు మేకర్స్. అందులో భాగంగానే సంక్రాంతికి విడుదలైన సినిమా రిజల్ట్ చూసిన తర్వాత హిందీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రిపబ్లిక్ వీకెండ్ కలిసి వచ్చేలా హిందీ వెర్షన్ ను ఈ శుక్రవారం రిలీజ్ చేశారు.
అక్కడ వచ్చే ప్రతి రూపాయి లాభమే..
సాధారణంగా బాలకృష్ణ సినిమాలు.. హిందీలో అది కూడా సినిమా రిలీజ్ అయిన రెండు వారాలకి డబ్బింగ్ వర్షన్ విడుదలవడం చాలా అరుదు. ఇకపోతే ‘అఖండ’ సినిమా డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్ రాబట్టింది. అఖండ 2 ను డైరెక్ట్ గా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని అడుగులు వేస్తున్నారు. దానికి ముందు శాంపుల్ గానే ఈv డాకు మహారాజ్ సినిమా హిందీ వర్షన్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇకపోతే బాలయ్య సినిమాను చూసిన హిందీ ప్రేక్షకుల నుండి ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఒకరకంగా చెప్పాలి అంటే, మాస్ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరించినంతగా నార్త్ ఆడియన్స్ పట్టించుకోరు. కానీ డాకు మహారాజ్ యాక్షన్ సీన్స్ ఆడియన్స్ కి మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోల నుంచి ఇలాంటి ఫైట్స్ ఎవరూ కూడా ఊహించి ఉండరు. తెలుగులో ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో అటు హిందీ రిలీజ్ కి కూడా డిమాండ్ బాగా పెరిగిపోయింది. అందుకే కమర్షియల్ లెక్కలు ఏమీ లేకుండా ఎంత వచ్చినా లాభమే అన్నట్టుగానే సినిమాను విడుదల చేశారు. మొత్తానికైతే ఈ సినిమా నుండి అక్కడ మిశ్రమ స్పందన లభిస్తోంది. కాబట్టి అక్కడ వచ్చే ప్రతి రూపాయి కూడా నిర్మాతలకు లాభమే అని చెప్పడంలో సందేహం లేదు.
డాకు మహారాజ్ సినిమా విశేషాలు..
‘డాకు మహారాజ్’ సినిమా విషయానికి వస్తే.. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), చాందిని చౌదరి (Chandini choudhury), శ్రద్ధా శ్రీనాథ్ (Shraddha shrinath) హీరోయిన్లుగా నటించగా ఊర్వశీ రౌతేల (Urvashi Rautela) కీలక పాత్ర పోషించారు. అంతేకాదు స్పెషల్ సాంగ్ లో కూడా నడిపించారు. ఇకపోతే బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ ఈ సినిమాలో నటించింది. కాబట్టి హిందీ ఆడియన్స్ కి ఇది ఒక స్పెషల్ క్రేజ్ అని చెప్పవచ్చ. మొత్తానికి అయితే హిందీలో విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకుంటున్న ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి అక్కడి ఆడియన్స్లో ఎలాంటి క్రేజ్ ను సొంతం చేసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా అఖండ 2 కోసం ఇప్పటినుంచే అడుగులు వేయడం నిజంగా ముందస్తు ఆలోచన అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.