BigTV English

Shah Rukh Khan : కొత్త లగ్జరీ కారులో దర్శనమిచ్చిన షారుఖ్… ఆ కారు కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

Shah Rukh Khan : కొత్త లగ్జరీ కారులో దర్శనమిచ్చిన షారుఖ్… ఆ కారు కాస్ట్ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే

Shah Rukh Khan : సెలబ్రిటీల్లో చాలామందికి హై ఎండ్ లగ్జరీ కార్లు అంటే ఇష్టం ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు ఈ స్టార్ హీరోలు మార్కెట్ లోకి కొత్తగా వచ్చే ఖరీదైన కార్లను కొంటూ వార్తల్లో నిలుస్తారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కొత్త కారులో ముంబై వీధుల్లో చక్కర్లు కొడుతూ కెమెరా కంటికి చిక్కారు. ఇంకేముంది ఆయన కొత్త కారు ధర ఎంత? ఆ కారు ఫీచర్లు ఏంటి ? అని ఆరా తీయడం మొదలుపెట్టారు నెటిజన్లు.


ఆ కార్ కాస్ట్ తో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సెట్

సాధారణంగానే స్టార్ హీరోలు అనగానే వాళ్ళు పెట్టుకునే రింగు, వాచ్, చెప్పులు, బట్టలు, కార్లు, బైకులు… ప్రతి యాక్సిసరీపై స్పెషల్ గా ఓ కన్ను వేసి ఉంచుతారు అభిమానులు. అయితే స్టార్ హీరోలు కూడా వాటికి భారీగా ఖర్చు పెడతారు. పైగా బ్రాండెడ్ యాక్సెసరీస్ ధరించి తమను తామ స్పెషల్ గా ఉండేలా చూసుకుంటారు. అలాగే తాజాగా షారుక్ ఖాన్ గ్యారేజీలో కొత్త కారు వచ్చి చేరింది. ఈ సరికొత్త లగ్జరీ కారులో ఆయన ముంబైలో ప్రయాణిస్తున్న ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


సాధారణంగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) బీఎండబ్ల్యూ లేదా అల్ట్రా-స్వాంకీ రోల్స్-రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్‌ కారులో ప్రయాణిస్తూ ఉంటారు. కానీ తాజాగా షారుక్ మొట్టమొదటిసారి లెక్సస్ ఎల్ఎం 350h 4s అల్ట్రా లగ్జరీ హై ఎండ్ కారులో కనిపించారు. ఈ కారు ఇండియాలోనే అత్యంత ఖరీదైన వాటిలో ఒకటని చెప్పాలి. దీని ధర అక్షరాల రూ. 3 కోట్లు. ఇక ఈ కారు ధర తెలిసిన అభిమానులు ఆ 3 కోట్లతో ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో సెట్ అవ్వొచ్చు అని ఆశ్చర్యపోతున్నారు.

కొడుకు కోసమే ఈ లగ్జరీ కారు

కాగా సమాచారం ప్రకారం షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) తన చిన్న కుమారుడు అబ్రామ్ కోసం అక్టోబర్లో ఈ లెక్సస్ కారును కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన గ్యారేజీలో పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే… జవాన్, పఠాన్ హిట్ల తర్వాత ‘డంకి’ మూవీతో ఓ డిజాస్టర్ అందుకున్నారు. 2024లో ఒక్క సినిమా కూడా చేయలేదు కింగ్ ఖాన్. ఈ స్టార్ హీరో నెక్స్ట్ ‘కింగ్’ అనే సినిమా చేయబోతున్నారు. అందులో తన గారాలపట్టి సుహానా ఖాన్ తో షారుఖ్ స్క్రీన్ ను షేర్ చేసుకోబోతున్నారు.

లెక్సస్ లగ్జరీకారు ఉన్న సెలబ్రిటీలు…

ఇండియాలో ప్రస్తుతం ఈ లెక్సస్ హై ఎండ్ కారు ట్రెండ్ గా మారింది. సౌత్ నుంచి నార్త్ దాకా పలువురు సెలబ్రిటీలు ఈ కారుని కొనుగోలు చేశారు. ఆ లిస్టులో అక్కినేని నాగార్జున, జాన్వి కపూర్, రణబీర్ కపూర్ లాంటి స్టార్ హీరోలు ఉన్నారు. అలాగే షారుఖ్ కూడా ఈ కారులోనే ముంబైలో షికార్లు కొడుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×