BigTV English

Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ లో అసంతృప్తి.. అసలు ఏమైందంటే..?

Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ లో అసంతృప్తి.. అసలు ఏమైందంటే..?

Daaku Maharaj:ఎవరైనా అభిమానులు తమ అభిమాన హీరో సినిమా విడుదలై హిట్ కొడితే, ఆ అభిమానుల్లో ఉండే ఆనందం అంతా ఇంతా కాదు. కానీ తాజాగా నందమూరి బాలకృష్ణ (Balakrishna ) డాకు మహారాజ్ (Daaku maharaj ) మూవీ విడుదలై హిట్ కొట్టినా కూడా నందమూరి అభిమానుల్లో ఎలాంటి ఆనందం లేదట. అయితే తమ అభిమాన హీరో సినిమా హిట్ అయినా కూడా నందమూరి ఫ్యాన్స్ ఎందుకు నిరాశలో ఉన్నారు..?దానికి కారణం ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం.. ‘డాకు మహారాజ్’ సినిమా వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ రాబట్టినప్పటికీ నైజాంలో మాత్రం చెత్త రికార్డు నెలకొందట. ఎందుకంటే గతంలో దిల్ రాజు (Dilraju ) నిర్మాతగా చేసిన ‘భగవంత్ కేసరి’ సినిమా 2023 దసరాకి విడుదలై నైజాంలో రూ.15 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఎంతో స్పెషల్ అయినటువంటి సంక్రాంతికి వచ్చినా డాకు మహారాజ్ సినిమా మాత్రం ఇప్పటివరకు రూ.10 కోట్లు మాత్రమే వసూలు చేసింది.


నైజాంలో డాకు మహారాజ్ కి అన్యాయం జరిగిందా?

ఇక ఈ కలెక్షన్స్ విషయంలో.. బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా నిరాశ పడుతున్నారట. ముఖ్యంగా ఈ సినిమాకి కలెక్షన్లు రాకపోవడానికి కారణం నైజాంలో డాకు మహారాజ్ సినిమాకి థియేటర్లు ఎక్కువగా లేకపోవడమేనట.నైజాంలో డాకు మహారాజ్ మూవీకి కేవలం 180 స్క్రీన్లు మాత్రమే ఇచ్చారట. కానీ మరో పెద్ద సినిమాకి 250 స్క్రీన్లు ఇచ్చారట. దిల్ రాజు డాకు మహారాజ్ సినిమా విషయంలో బాలకృష్ణ ఫ్యాన్స్ ని తీవ్రంగా హర్ట్ చేశారని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమా భారీ డిజాస్టర్ అవ్వడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా.. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకొని మరిన్ని థియేటర్లు పెంచుకుంటుంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి హిట్ టాక్ రావడంతో ఈ సినిమాకి మరిన్ని స్క్రీన్లు పెంచుతున్నారు. అంతేకాకుండా నైజాం ఏరియాలో దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh babu ) ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తన తమ్ముడి సినిమాకి ఎక్కువ స్క్రీన్లు వచ్చేలా చూస్తున్నారట. అంతేకాకుండా డాకు మహారాజ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు గేమ్ ఛేంజర్ సినిమాని ఎక్కువగా పట్టించుకుని, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాని పక్కన పెట్టిన కారణంగానే నైజాంలో డాకు మహారాజ్ మూవీకి తక్కువ కలెక్షన్లు వచ్చినట్టు తెలుస్తోంది.


దిల్ రాజు పై గుర్రుగా ఉన్న బాలయ్య ఫ్యాన్స్..

ఒకవేళ ఈ సినిమాకి నైజాంలో ఎక్కువ స్క్రీన్లు కనుక కేటాయిస్తే.. కచ్చితంగా ఓపెనింగ్స్ లోనే ఎక్కువ మొత్తంలో కలెక్షన్లు డాకు మహారాజ్ మూవీ రాబట్టేదని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. నైజాంలో తక్కువ స్క్రీన్లు దొరకడం వల్లే డాకు మహారాజ్ మూవీ నైజాంలో తక్కువ వసూళ్లు సాధించిందని నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతికి వచ్చిన మూడు సినిమాల్లో గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలకి దిల్ రాజు నిర్మాత కాగా.. డాకు మహారాజ్ సినిమాకి నాగ వంశీ నిర్మాతగా చేశారు .కానీ నైజాంలో మాత్రం దిల్ రాజు కొనుగోలు చేశారు. ఇక నైజాంలో ఏ సినిమాకి ఎన్ని స్క్రీన్లు కేటాయించాలో దిల్ రాజు ఇష్టం. అలా తన ఇష్టారీతిన వ్యవహరించి డాకు మహారాజ్ కి దిల్ రాజు అన్యాయం చేశారని నందమూరి ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. అంతేకాకుండా నైజాంలో నందమూరి బాలకృష్ణకి మంచి క్రేజ్ ఉంది. కానీ డాకు మహారాజ్ కలెక్షన్స్ ప్రభావం బాలకృష్ణ రాబోయే సినిమాలపై కూడా పడతాయని, ఈ విషయంలో దిల్ రాజు చేసిన తప్పు వల్ల బాలకృష్ణ భవిష్యత్ సినిమాలకు కూడా ఇబ్బందులు వస్తాయని బాలకృష్ణ అభిమానులు బాధపడుతున్నారు. అలా డాకు మహారాజ్ మూవీ హిట్ అయిన కూడా బాలకృష్ణ అభిమానుల్లో ఆనందం లేదని, అలాగే ఈ విషయంలో బాలకృష్ణ కూడా కాస్త గుర్రుగా ఉన్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×