Indian Railways: దేశ వ్యాప్తంగా నిత్యం 13 వేల రైళ్లు నడుస్తున్నాయి. రోజూ సుమారు 3 కోట్ల మంది రైలు ప్రయాణం చేస్తున్నారు. తక్కువ ధరలో ఆహ్లాదకర ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్నారు ప్రజలు. ఇక రైళ్లలో పలు రకాలు ఉన్నాయి. ప్యాసింజర్ రైలు, మెయిల్ ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సహా పలు రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. ఇంతకీ ఈ రైళ్లకు ఇన్ని రకాల పేర్లు ఎందుకు? ముఖ్యంగా మెయిల్ ఎక్స్ ప్రెస్ కు ఆ పేరు ఎలా వచ్చింది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే, పలు ఎక్స్ ప్రెస్ రైళ్ల మధ్య ఉన్న తేడాలేంటో చూద్దాం..
⦿ మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు
కొద్ది సంవత్సరాల క్రితం వరకు రైళ్లలో పోస్టు బాక్సులు ఉండేవి. వీటి ద్వారా దేశంలోని పలు ప్రాంతాలకు లెటర్లు, పార్శిళ్లను పంపించే వాళ్లు. అలాంటి రైళ్లకు మెయిల్ ఎక్స్ ప్రెస్ అని పేరు పెట్టారు. ప్రస్తుతం ఆయా రైళ్లలో పోస్టు బాక్సులను తొలగించారు. అయినప్పటికీ, ఈ రైళ్లను ఇప్పటికీ మెయిల్ ఎక్స్ ప్రెస్ రైళ్లు అని పిలుస్తున్నారు. ఈ రైళ్లు గంటకు 50 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ రైళ్లు తమ రూట్ లోని అన్ని స్టేషన్లలో ఆగుతూ వెళ్తుంటాయి.
⦿ సూపర్ ఫాస్ట్ రైళ్లు
సూపర్ ఫాస్ట్ రైళ్లు సాధారణంగా గంటకు 100 కిలో మీటర్లకు పైగా వేగంతో ప్రయాణిస్తాయి. మెయిల్ ఎక్స్ ప్రెస్ , ఎక్స్ ప్రెస్ రైళ్తో పోల్చితే ఈ రైళ్లు చాలా తక్కువ స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైళ్లలు ఛార్జీలు కూడా ఎక్కువగానే ఉంటాయి. సుదూర మార్గాల్లో ఈ రైళ్లు తమ సేవలను కొనసాగిస్తున్నాయి.
⦿ ఎక్స్ ప్రెస్ రైళ్లు
సూపర్ ఫాస్ట్ రైళ్లతో పోలిస్తే ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగం కాస్త తక్కువగా ఉంటుంది. మెయిల్ రైళ్ల కంటే వేగంగా వెళ్తాయి. ఈ రైళ్లు గంటకు సగటున 55 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఇవి కూడా పరిమిత రైల్వే స్టేషన్లలోనే ఆగుతుంటాయి. ఈ రైళ్లు అనుకున్న సమయానికి గమ్యాన్ని చేరుకుంటాయనే పేరుతుంది.
Read Also : సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు ప్రత్యేక రైలు.. యాత్రా ప్యాకేజీని ప్రకటించిన ఐఆర్‌సీటీసీ !
⦿ ప్యాసింజర్ రైళ్లు
భారతీయ రైల్వే సంస్థ ఈ రైళ్లను తక్కువ దూర ప్రాంతాలకు నడిపిస్తుంది. ఈ రైళ్లలో అన్ని జనరల్ కోచ్ లు ఉంటాయి. ఈ రైళ్లు ప్రయాణించే రూట్ లోని అన్ని స్టేషన్లలో ఆగుతాయి. ఈ రైళ్ల వేగం చాలా తక్కువగా ఉంటుంది. అంటే గంటలకు 50 కిలో మీటర్లకు లోపే ప్రయాణిస్తుంది. ఈ రైళ్లు చాలా నెమ్మదిగా గమ్య స్థానాలకు చేరుకుంటాయి. పేద ప్రజలు ఈ రైళ్లలో ప్రయాణం చేసేందుకు మొగ్గు చూపుతారు. ఎంతకంటే, ఈ రైళ్లలో టికెట్ ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి.
Read Also : వందే భారత్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు, వీటిలో మీరు వెళ్లే ట్రైన్స్ ఉన్నాయేమో చెక్ చేసుకోండి !