BigTV English
Advertisement

BalaKrishna : బాలయ్యను ఊరిస్తున్న ఆ రికార్డు… డాకుతో కొత్త రికార్డు క్రియేట్ అవ్వడం పక్కా..!

BalaKrishna : బాలయ్యను ఊరిస్తున్న ఆ రికార్డు… డాకుతో కొత్త రికార్డు క్రియేట్ అవ్వడం పక్కా..!

BalaKrishna :బాలకృష్ణ (Balakrishna ) కెరియర్ లోనే భారీ అంచనాలతో వస్తున్న సినిమాలలో ‘డాకు మహారాజ్’ ఒకటి. ఈ సినిమాకి నిర్మాత నాగ వంశీ (Naga Vamshi) ఇప్పటికే భారీ హైప్ ఇచ్చాడు.అలాగే డైరెక్టర్ బాబీ కొల్లి (Bobby Kolli) కెరియర్ లో తీసిన అన్ని సినిమాల కంటే డాకు మహారాజ్ మొదటి స్థానంలో ఉంటుందని, చిరంజీవి(Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ కంటే డాకూ మహారాజ్ మూవీ అద్భుతంగా ఉంటుంది అంటూ ఎన్నో గొప్పలు చెప్పారు నాగ వంశీ. అయితే నాగ వంశీ చెప్పిన మాటలకు డాకు మహారాజ్ ట్రైలర్ కి ఏ మాత్రం సెట్ అవ్వలేదు. ట్రైలర్ చూసి చాలామంది నిరాశపడ్డారు. బాలకృష్ణ రేంజ్లో ఈ ట్రైలర్ లేదని పెదవి విరిచారు. అయితే నాగ వంశీ ఈ సినిమాకి బాగా హైప్ ఇచ్చారు కాబట్టి సినిమా ఎలా ఉంటుంది అని చూడటానికి చాలా మంది ఆసక్తిగా అయితే ఉన్నారు.


అయితే ఇప్పటికే ఈ సినిమాకి రూ. 70 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మొదటి రోజు సినిమాకి కలెక్షన్లు బాగానే వస్తాయని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఇప్పటి వరకు నటించి హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ ఉన్న ఈ ఐదు సినిమాలను డాకు మహారాజ్ బ్రేక్ చేస్తుందా అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక డాకు మహారాజ్ కి ఇచ్చిన హైప్ చూస్తే మాత్రం బాలకృష్ణ ఇంతకుముందు చేసిన సినిమాల ఓపెనింగ్స్ అన్నింటినీ డాకు మహారాజ్ బ్రేక్ చేయాలి. మరి ఇంతకీ బాలకృష్ణ కెరియర్ లో హైయ్యెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న ఆ సినిమాలు ఏంటి? వాటిని డాకు మహారాజ్ బ్రేక్ చేయగలదా అనేది ఇప్పుడు చూద్దాం..

వీర సింహారెడ్డి :


గోపీచంద్ మలినేని (Gopichand malineni) డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా చేసిన మూవీ ‘వీర సింహారెడ్డి’.. బాలయ్య సినీ కెరియర్ లోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యంత ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమాగా వీరసింహారెడ్డికి పేరుంది.ఈ సినిమా మొదటి రోజు రూ.25.35 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇది బాలయ్య సినీ కెరియర్ లోనే హైయ్యెస్ట్ ఓపెనింగ్.

అఖండ :

బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను (Boyapati sreenu) దర్శకత్వం వహించిన ‘అఖండ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పనక్కర్లేదు.ఈ సినిమాకి సీక్వెల్ కూడా వస్తోంది.ఇక అఖండ మూవీ మొదటి రోజు రూ.15.39 కోట్ల షేర్ వసూలు చేసింది.

భగవంతు కేసరి: .

బాలకృష్ణ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల బాలకృష్ణ కూతురు పాత్రలో నటించిన భగవంత్ కేసరి.. తండ్రి కూతుర్ల అనుబంధంతో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా మొదటిరోజు 14.36 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

ఎన్టీఆర్ కథానాయకుడు:

సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ గా తెరకెక్కిన ఎన్టీఆర్ కథానాయకుడులో బాలకృష్ణ తండ్రి పాత్రలో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి రావడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డారు? ఎలా రాణించారు? అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక సినిమా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చూడ్డానికి ఆసక్తి కనబరిచారు. అలా ఈ మూవీ రూ.7.6 కోట్ల షేర్ వసూలు చేసింది.కానీ ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది.

అలా బాలకృష్ణ సినీ కెరియర్ లో ఇప్పటివరకు ఈ 4 సినిమాలే ఓపెనింగ్స్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. మరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాతో ఈ 4 సినిమాల ఓపెనింగ్స్ ని బ్రేక్ చేసి సత్తా చాటుతాడా లేదా అనేది చూడాలి.ఇప్పటికే బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమాకి ఇచ్చిన హైప్ చూస్తే రూ.100 కోట్ల క్లబ్ లో బాలకృష్ణ చేరబోతున్నట్టు వార్తలైతే వస్తున్నాయి. మరి చూడాలి సినిమా ఎలా ఉంటుందో.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×