BigTV English

Balakrishna : తన సంపాదన అదే.. తొలిసారి అలాంటి కామెంట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి.!

Balakrishna : తన సంపాదన అదే.. తొలిసారి అలాంటి కామెంట్స్ తో ఫ్యాన్స్ ఉక్కిరి బిక్కిరి.!

Balakrishna :నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల నటించిన ‘డాకు మహారాజ్’ మూవీ నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్లను కలెక్ట్ చేసి, బాలకృష్ణను రూ.100 కోట్ల క్లబ్ లో చేర్చింది. అయితే బాలకృష్ణ ఇంతకు ముందు నటించిన సినిమాలు కూడా హిట్ అవ్వడంతో వరుస హిట్స్ ని ఖాతాలో వేసుకుంటున్న సీనియర్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అలా అఖండ సినిమా మొదలు వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి, ఇప్పుడు డాకు మహారాజ్ అలా వరుసగా నాలుగు హిట్స్ ని తన ఖాతాలో వేసుకొని బాలకృష్ణ తన నట విశ్వరూపం చూపిస్తున్నారు.అయితే భగవంత్ కేసరి మూవీ సో సో అనిపించినప్పటికీ,ఆ తర్వాత వచ్చిన డాకు మహారాజ్ సినిమా మాత్రం బాలకృష్ణ నట విశ్వరూపాన్ని చూపించింది.ఈ సినిమాలో బాలకృష్ణను చూసి ఆయన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనుకోవచ్చు. అయితే అలాంటి బాలకృష్ణ ఈ సినిమా కోసం ఎన్నో ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొని సినిమా గురించి ఎన్నో విషయాలు పంచుకున్నారు.


అభిమానులే నా ఆస్తి అంటున్న బాలకృష్ణ..

అలా బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో ఈయన మాట్లాడుతూ.. నేను సంపాదించిన ఆస్తి అదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ఇంతకీ బాలకృష్ణ ఆ ప్రమోషనల్ ఈవెంట్లో ఏం మాట్లాడారు అనేది చూస్తే.. “నేను ఇప్పటి వరకు సంపాదించింది ఏదైనా ఉంది అంటే అది నా అభిమానులే.. కుల, మత, పార్టీలకు అతీతంగా నాకు అభిమానులు ఉన్నారు. అదే నేను నా జీవితంలో సంపాదించిన గొప్ప ఆస్తి” అంటూ అభిమానులను ఉద్దేశిస్తూ గొప్పగా చెప్పుకొచ్చారు. ఇది విన్న తర్వాత బాలయ్య అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. అలాగే డైట్ గురించి మాట్లాడుతూ.. “నా భార్య వసుంధరా దేవి తిండి విషయంలో నన్ను ఎప్పుడూ తిడుతూ ఉంటుంది.కానీ నేను ఫిట్ గా ఉండడానికి అంత పెద్ద సీక్రెట్ లు ఏమీ లేవు. నేను ఫుడ్ విషయంలో ఎలాంటి డైట్ పాటించను. అంతేకాదు ఈ ఫుడ్డే తినాలి అని రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టుకోను. షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు ప్రొడక్షన్ హౌస్ లోని ఫుడ్ కూడా తింటాను.ఆ విషయంలో నాకు ఎలాంటి మొహమాటం ఉండదు”.. అంటూ బాలకృష్ణ చెపుకొచ్చారు.


బాలకృష్ణ సినిమాలు..

బాలకృష్ణ డాకు మహారాజ్ హిట్ తో అఖండ -2 పై కూడా భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇక రీసెంట్ గానే మహా కుంభమేళా జరుగుతున్న సమయంలోనే బాలకృష్ణ అఖండ -2 సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu ).అయితే అఖండ సినిమాలో అఘోర పాత్రలో బాలకృష్ణ కనిపించారు. కాబట్టి అఖండ2 లో కూడా ఆ పాత్ర కంటిన్యూ అవుతుంది. అందుకే మహాకుంభమేళలో సాధువులు అందరూ ఒకే దగ్గర ఉంటారు. కాబట్టి తన షూటింగ్ కి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని గ్రహించిన బోయపాటి శ్రీమహా కుంభమేళ మొదలయ్యాక అక్కడే అఖండ 2 మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇక అఖండ- 2 మూవీలో కూడా హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. ఇప్పటికే అఖండ, డాకు మహారాజ్ సినిమాలు వీరిద్దరి కాంబినేషన్లో రాగా.. ఇప్పుడు అఖండ 2 కూడా రాబోతోంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×