Manu Bhaker: పారిస్ ఒలంపిక్స్ 2024 పథక విజేత, భారత స్టార్ షూటర్ మను భాకర్ ఇంట విషాదం నెలకొంది. ఆదివారం రోజు తెల్లవారిజామున హర్యానాలోని చర్ఖి ధాత్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మను భాకర్ మేనమామ, ఆమె అమ్మమ్మ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. మహేంద్రఘడ్ బైపాస్ రోడ్డులో ఆదివారం ఉదయం 9 గంటలకు స్కూటర్, బ్రెజ్జా కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
Also Read: Abhinav Manohar: SRH చేతిలో మరో డేంజర్ ఆల్ రౌండర్.. క్యావ్యాపాప ప్లాన్ అదుర్స్ !
ఈ ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి చెందారు. ఇటీవలే రాష్ట్రపతి చేతుల మీదుగా ఖేల్ రత్న అవార్డును అందుకున్న ఆమెకు ఈ విషాద సంఘటన చేదుని మిగిల్చింది. వీరు స్కూటీపై ప్రయాణిస్తుండగా బ్రేజ్జా కారు వారిని ఢీ కొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే కారులోని డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపించి.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మను భాకర్ అమ్మమ్మ వయసు 70 సంవత్సరాలు కాగా.. ఆమె మేనమామ వయస్సు 50 సంవత్సరాలు.
ఆమె అమ్మమ్మ సావిత్రి దేవి కూడా జాతీయ స్థాయిలో పథకాలు సాధించి క్రీడలలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ విషాద ఘటనతో మను భాకర్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. మను భాకర్ సోషల్ మీడియా వేదికగా తన మామయ్య, అమ్మమ్మలకు నివాళులు అర్పించారు. ఈ విషాద ఘటన పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తనకి, తన కుటుంబానికి మద్దతు ఇచ్చిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
పారిస్ ఒలంపిక్స్ 2024 ( Paris Olympics 2024) లో భారత్ కి తొలి పథకాన్ని అందించింది మను భాకర్. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ లో ఆమె కాంస్య పథకాన్ని గెలుచుకుంది. టీనేజర్ గా ఉన్నప్పటినుండే ఆమె షూటింగ్ లో రాణిస్తోంది. ఈమె 2022 ఫిబ్రవరి 18న జన్మించింది. పాఠశాలలో టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ వంటి క్రీడలలో రాణించి.. 2016 రియో ఒలంపిక్స్ ముగిసిన తర్వాత 14 ఏళ్ల వయసులోనే తన పూర్తి దృష్టిని షూటింగ్ పై పెట్టింది.
Also Read: India Squad: గంభీర్ వర్సెస్ రోహిత్.. BCCI మీటింగ్ లోనే డిష్యూం..డిష్యూం !
స్పోర్ట్స్ షూటింగ్ పిస్టల్ కావాలని తండ్రి రామ్ కిషన్ బాకర్ ని కోరింది. దీంతో ఆమె తండ్రి కూడా వెంటనే పిస్టల్ కొనిచ్చారు. అప్పుడు ఆమె తీసుకున్న ఆ నిర్ణయమే ఇప్పుడు ఒలంపియన్ గా ప్రపంచం ముందు నిలిపింది. 2017లో జరిగిన జాతీయ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మాజీ ప్రపంచ నంబర్ వన్ హీనా సిద్దు ని ఓడించింది మను. ఆ తర్వాత కామన్వెల్త్ తో పాటు పలు పోటీలలో పథకాలు సాధించింది. ఇలా జాతీయ క్రీడలలో ఎన్నో పథకాలు సాధించి మంచి పేరు తెచ్చుకున్న మను ఇంట నేడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
స్టార్ షూటర్, ఒలంపిక్ మెడలిస్ట్ మనూ భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం
రోడ్డు ప్రమాదంలో మనూ భాకర్ అమ్మమ్మ, మేనమామ మృతి
హర్యానాలోని మహేంద్రగఢ్ సమీపంలో వారు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొన్న కారు
ఘటనలో ఆ ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందినట్టు సమాచారం pic.twitter.com/vl5maKYQwD
— BIG TV Breaking News (@bigtvtelugu) January 19, 2025