Marco 2: మామూలుగా మలయాళం సినిమాలు అంటే ఫీల్ గుడ్ ఉంటాయని, అప్పుడప్పుడు మలయాళ మేకర్స్ థ్రిల్లర్స్‌ను కూడా బాగా తెరకెక్కిస్తారని ప్రేక్షకులు ప్రశంసిస్తుంటారు. కానీ మలయాళంలో కూడా వైలెంట్ సినిమాలు తెరకెక్కుతాయని తాజాగా విడుదలయిన ఒక మూవీ నిరూపించింది. అదే ‘మార్కో’. మామూలుగా ఇండియన్ భాషల్లో ఒక రేంజ్‌లో వైలెన్స్ చూపించడం అనేది మేకర్స్‌కు అలవాటు లేదు. కానీ గత కొన్నేళ్లుగా విడుదలయిన ఎన్నో సినిమాలు వైలెన్స్‌కు మరో అర్థం చెప్పాయి. కొన్నాళ్ల క్రితం విడుదలయిన ‘మార్కో’ కూడా అదే కేటగిరిలో యాడ్ అయ్యింది. ఈ మూవీని అమితంగా ఇష్టపడిన వారికి మేకర్స్ ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నారు.
దర్శకుడికి ఫిదా
ఉన్ని ముకుందన్ (Unni Mukundan) హీరోగా హనీఫ్ అదేని (Haneef Adeni) తెరకెక్కించిన చిత్రమే ‘మార్కో’ (Marco). ఈ సినిమాలో వైలెన్స్‌ను ఓ రేంజ్‌లో చూపించి ప్రేక్షకులను.. ముఖ్యంగా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకున్నారు మేకర్స్. అసలు ఈ సినిమా తీసింది మాలీవుడ్డేనా అని అందరికీ అనుమానం వచ్చేలా చేశారు. మొత్తానికి మలయాళంలో ఇప్పటివరకు ఎవరూ తెరకెక్కించని సినిమాను తెరకెక్కించి ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు హనీఫ్. తెలుగు మేకర్స్ సైతం హనీఫ్ టేకింగ్‌కు ఫిదా అయ్యి ‘మార్కో’ గురించి పలు సందర్భాల్లో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఈ మూవీ విడుదలయ్యి హిట్ అయిన కొన్నిరోజుల్లోనే దీని సీక్వెల్ గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.
అవి రూమర్సే
చాలామంది నటీనటులు, దర్శక నిర్మాతలు ‘మార్కో’ టీమ్‌ను ప్రత్యేకంగా కలిసి ఈ సినిమా సక్సెస్ అయినందుకు కంగ్రాట్స్ తెలిపారు. అలాగే తమిళ హీరో విక్రమ్ కూడా హనీఫ్‌తో పాటు ఉన్ని ముకుందన్‌ను తన నివాసంలో కలిశాడు. అప్పుడు ‘మార్కో 2’ గురించి రూమర్స్ మొదలయ్యాయి. ‘మార్కో’కు కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని, అందులో విక్రమ్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి. విక్రమ్ నటిస్తున్నాడనే విషయం నిజం కాకపోయినా.. ‘మార్కో 2’ తెరకెక్కుతుందనే విషయం మాత్రం నిజమని తేలిపోయింది. మొదటి పార్ట్ కంటే సీక్వెల్‌ను మరింత గ్రాండ్ లెవెల్‌లో తెరకెక్కించి ప్రేక్షకులను మరోసారి ఆశ్చర్యపరచడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. ‘మార్కో 2’లో విక్రమ్ ఉండబోతున్నాడనే వార్తలు రూమర్స్ అని తేలిపోయిన తర్వాత ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఉండనున్నాడనే రూమర్స్ బయటికొచ్చాయి.
Also Read: అందుకే నాకు మనుషులంటే నచ్చరు.. చిత్రహింసలపై రేణూ షాకింగ్ కామెంట్స్..!
మలయాళ సూపర్‌స్టార్‌తో
ఇటీవల ఉన్ని ముకుందన్ స్వయంగా వెళ్లి మోహన్ లాల్‌ను కలిసిన తర్వాత రూమర్స్ మొదలయ్యాయి. ఒకవేళ ‘మార్కో 2’ తెరకెక్కుతున్న మాట పూర్తిగా నిజమే అని మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తే మాలీవుడ్‌లో ఎక్కువమంది ప్రేక్షకులు ఎదురుచూసే సినిమా ఇదే అవుతుంది. ‘మార్కో’ థియేటర్లలో విడుదలయ్యి నెలరోజులు పైనే అయ్యింది అయినా చాలామంది ఆడియన్స్ ఇంకా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ రేంజ్‌లో ఈ మూవీ అందరిపై ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సీక్వెల్ కూడా అదే రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ‘మార్కో’ను అమితంగా ఇష్టపడిన ఆడియన్స్ అనుకుంటున్నారు.