BigTV English

VD12: రౌడీ హీరో కోసం రంగంలోకి నందమూరి హీరో.. ఇది అస్సలు ఊహించలేదే..?

VD12: రౌడీ హీరో కోసం రంగంలోకి నందమూరి హీరో.. ఇది అస్సలు ఊహించలేదే..?

VD12: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ప్రస్తుతం ఒక భారీ విజయం కావాలి. లైగర్ సినిమాతో మొదలైన ప్లాపుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. విజయ్ ను లైగర్ ఏ రేంజ్ లో ముంచిందో అందరికీ తెల్సిందే. ఈ సినిమా తరువాత విజయ్ కోలుకోలేకపోతున్నాడు. త ఫ్యామిలీ స్టార్ సినిమాతో కొద్దిగా పైకి రావాలని చూసాడు. కానీ, ఈ సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో విజయ్ ఆశలన్నీ VD12 మీదనే పెట్టుకున్నాడు.


జెర్సీ సినిమాతో టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన  గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా తరువాత అతని రేంజ్ మారిపోయింది.  ఇక జెర్సీ తరువాత రామ్ చరణ్ తో ఒక సినిమాను ప్రకటించారు కానీ, అది మధ్యలోనే ఆగిపోయిందని, ఆ కథనే  విజయ్ తో చేస్తున్నాడని టాక్. ఇక VD12 లో విజయ్ రెండు గెటప్స్ తో కనపడనున్నాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. గ్యాంగ్ స్టర్, పోలీస్ గెటప్స్ లో విజయ్ కనిపించనున్నాడట.

Rana: బాలయ్య బాబుకు పోటీగా రానా.. ఇప్పుడు ఇదే ట్రెండ్ మరీ!


ఇక ఈ సినిమాను సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ  నిర్మిస్తున్నాడు. మొట్టమొదటిసారి విజయ్ సరసన శ్రీలీల రొమాన్స్ చేయడానికి  రెడీ అయ్యింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. గుండు లుక్ లో విజయ్  మాస్ అవతార్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

అదేంటంటే.. త్వరలోనే VD12 టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇక  ఆ టీజర్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ను అందివ్వనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.   రౌడీ హీరోకు నందమూరి హీరోకు మంచి ర్యాపో ఉన్న విషయం తెల్సిందే. మొన్న ఒక ఈవెంట్ లో కూడా బాలయ్య గురించి విజయ్ చేసిన వ్యాఖ్యలు నందమూరి ఫ్యాన్స్ ను అలరించాయి.

Raashi Khanna Emotional: బ్రేకప్ వల్ల నరకం చూసా.. రాశీ ఖన్నా ఎమోషనల్ కామెంట్స్..!

ఇక అందులోనూ సితార ఎంటర్ టైన్మెంట్స్ లోనే బాలయ్య NBK109 తెరకెక్కుతుంది. నాగవంశీ అడిగితే బాలయ్య కాదు అనడు. అందుకే ఈ టీజర్ కు ఆయన వాయిస్ ను అందివ్వడానికి ఓకే అన్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందంతో గెంతులు వేస్తున్నారు.

రౌడీ హీరోకు బాలయ్య ఎలివేషన్ ఇస్తే ఆ కిక్కే వేరబ్బా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఇకపోతే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాతోనైనా విజయ్ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడా.. ? లేదా.. ? అనేది తెలియాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×