OTT Movie : న్యూయార్క్ నగరంలో రాత్రి పూట, ఒక భయంకరమైన మంచుతుఫాను కురుస్తుంటుంది. ఒక వాల్ స్ట్రీట్ స్టాక్‌బ్రోకర్ అయిన రొసారియో ఫ్యూంటెస్ తన అమ్మమ్మ గ్రిసెల్డా మరణవార్తను తెలుసుకుని అక్కడికి వెళ్తుంది. అక్కడ రొసారియో అమ్మమ్మ శవంతో ఒంటరిగా అపార్ట్‌మెంట్‌లో రాత్రి గడపాల్సి వస్తుంది. ఎందుకంటే తుఫాను కారణంగా అంబులెన్స్ రావడానికి ఆలస్యమవుతుంది. కానీ ఆ రాత్రి ఆమె జీవితం తలకిందులు అవుతుంది. అపార్ట్‌మెంట్ నుండి వచ్చే భయంకరమైన శబ్దాలతో రొసారియో వణికిపోతుంది. అక్కడే ఒక సీక్రెట్ గదిలో భయంకరమైన రహస్యం బయటపెడుతుంది. రొసారియో ఈ భయంకరమైన శక్తుల నుండి తప్పించుకోగలదా ? ఆమె కూడా ఈ శక్తులకు బలి అవుతుందా ? ఈ సినిమా పేరు, ఓటీటీ వివరాల గురించి తెలుసుకుందాం పదండి.
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ 1999లో రొసారియో ఫ్యూంటెస్ (ఎమిలియా ఫాచర్) అనే అమ్మాయి బాల్యంతో ప్రారంభమవుతుంది. ఆమె తన కుటుంబంతో బ్రూక్లిన్ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తుంటుంది. ఆమె తల్లి ఎలెనా (డయానా లీన్) అనారోగ్యంతో ఉంటుంది. ఆమె అమ్మమ్మ గ్రిసెల్డా (కాన్స్టాన్జా గుటిరెజ్) వింతైన ప్రవర్తనతో, కాథలిక్ మతంను నమ్ముతుంటుంది. ఇప్పుడు స్టోరీ ప్రస్తుత కాలంలో జరుగుతుంది. రొసారియో (ఎమెరాడ్ టౌబియా) ఒక విజయవంతమైన వాల్ స్ట్రీట్ స్టాక్‌బ్రోకర్‌గా సంతోషకరమైన జీవితం గడుపుతుంటుంది. ఇప్పుడు తన కుటుంబ గతం నుండి దూరంగా, ఆమె అమ్మమ్మ గ్రిసెల్డాతో సంబంధం లేకుండా జీవిస్తుంది. ఒక రోజు ఆమెకు గ్రిసెల్డా మరణించినట్లు కాల్ వస్తుంది. ఆమె తన అమ్మమ్మను చివరి చూపు చూడటానికి వస్తుంది. అయితే ఆ శవాన్ని తీసుకెళ్లే వరకు ఎవరైనా అపార్ట్‌మెంట్‌లో ఉండాలని, అపార్ట్‌మెంట్ సూపరింటెండెంట్ మార్టీ ఆమెతో చెప్తాడు. భారీ మంచుతుఫాను కారణంగా అంబులెన్స్ రావడం ఆలస్యమవుతుంది. ఇక చేసేదేం లేక రొసారియో ఒంటరిగా గ్రిసెల్డా శవంతో రాత్రిని గడపాల్సి వస్తుంది.
ఈ అపార్ట్‌మెంట్‌లోకి అడుగుపెట్టిన వెంటనే, రొసారియోకు వింత అనుభవాలు ఎదురౌతాయి. గ్రిసెల్డా శరీరంపై వింతైన గాయాలు ఉంటాయి. ఆమె ఫోన్‌లో గ్రిసెల్డా గొంతును వింటుంది. అది ఆమెను క్షమించమని కోరుతుంది. రొసారియో అపార్ట్మెంట్ లో ఒక సీక్రెట్ గదిని కనిపెడుతుంది. అందులో చేతబడి సామాగ్రి ఉంటాయి. ఇందులో ఆఫ్రికన్ స్పిరిచ్యువలిజం, కాథలిసిజంను కలిపి ఉంటాయి. రొసారియో తన అమ్మమ్మ ఈ రిచ్యువల్స్‌లో పాల్గొన్నట్లు తెలుసుకుంటుంది. రాత్రి గడిచేకొద్దీ, రొసారియో ను ఈ అమానుషమైన శక్తులు భయపెడుతుంటాయి. ఆమె పొరపాటున ఒక రిచ్యువల్‌ను ప్రారంభిస్తుంది. దీనివల్ల ఒక భయంకరమైన ఆత్మ అక్కడికి వస్తుంది. ఆమె తండ్రి ఆస్కర్ (జోస్ జూనిగా), మరో వ్యక్తి జో (డేవిడ్ డస్ట్‌మల్చియన్) ఈ కథలోకి ప్రవేశిస్తారు. కానీ వాళ్ళు కూడా ఈ దెయ్యాల బారిన పడతారు. రొసారియో తన కుటుంబానికి పట్టిన శాపం వల్ల ఇదంతా జరుగుతోందని గుర్తిస్తుంది. చివరికి రొసారియో కుటుంబానికి పట్టిన శాపం ఏమిటి ? దెయ్యాలను రొసారియో ఎలా ఎదుర్కుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : రివేంజ్ తీర్చుకోవడానికి అమ్మాయి చేసే అరాచకం… ఓటీటీలో గత్తర లేపుతున్న డెడ్లీ కిల్లర్ యాక్షన్ థ్రిల్లర్
ఈ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రొసారియో’ (Rosario). ఈ సినిమా 2025 మే 21 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమాకి ఫెలిపె వర్గాస్ దర్శకత్వం వహించారు. 1 గంట 28 నిమిషాలు నిడివి ఉన్న ఈ సినమాకి IMDbలో 4.3/10 రేటింగ్ ఉంది. ఇందులో ఎమెరాడ్ టౌబియా (రొసారియో ఫ్యూంటెస్), డేవిడ్ డస్ట్‌మల్చియన్ (జో), జోస్ జూనిగా (ఆస్కర్), డయానా లీన్ (ఎలెనా), పాల్ బెన్-విక్టర్ (మార్టీ), కాన్స్టాన్జా గుటిరెజ్ (గ్రిసెల్డా), ఎమిలియా ఫాచర్ (యంగ్ రొసారియో) వంటి నటులు నటించారు.