BigTV English

Daku Maharaj : వెనక్కి తగ్గిన ‘డాకు మహారాజ్‌’.. బాబీ పై ఫ్యాన్స్ ఆగ్రహం..

Daku Maharaj : వెనక్కి తగ్గిన ‘డాకు మహారాజ్‌’.. బాబీ పై ఫ్యాన్స్ ఆగ్రహం..

Daku Maharaj : నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన చేతిలో ‘డాకు మహారాజ్ ‘, అఖండ 2 సినిమాలు ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతుందని రిలీజ్ డేట్ ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటివరకు సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇవ్వలేదు. కనీసం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టలేదు. ఇప్పటికే షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. బ్యాలన్స్ షూట్‌ మొత్తం ఈనెల మూడో వారం వరకు పూర్తి చేసే విధంగా బాబీ ప్లాన్‌ చేస్తున్నారు. కానీ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్‌ ఛేంజర్‌, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు అప్డేట్స్ ఇస్తున్నారు. బాలయ్య డాకు నుంచి ఒక్క అప్డేట్ కూడా రాకపోవడం తో బాలయ్య ఫ్యాన్స్ డైరెక్టర్ పై కోపంగా ఉన్నారని తెలుస్తుంది.


బాలయ్య ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తను ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇప్పుడు బాబీ దర్శకత్వంలో డాకు మహారాజ్ సినిమాతో రాబోతున్నారు. ఇటీవలే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్‌ సంక్రాంతికి సినిమాను విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సంక్రాంతికి ఈ సినిమాతో పాటు రామ్‌ చరణ్‌ గేమ్‌ ఛేంజర్‌, వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబోలో రూపొందుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. అయితే ఆ సినిమాలు మాత్రం ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు.

వచ్చే ఏడాది సంక్రాంతికి ముందుగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబందించి ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమోట్‌ చేస్తున్నారు. తమిళ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ నుంచి ఇప్పటికే మూడు పాటలు విడుదల చేయడంతో పాటు టీజర్‌ సైతం విడుదల అయ్యింది. టీజర్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా గురించి రెగ్యులర్‌గా మీడియాలో చర్చ జరిగే విధంగా దర్శకుడు అనిల్‌ రావిపూడి ఏదో ఒక విధంగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ డాకు సినిమా ప్రమోషన్స్‌ ఏమాత్రం జరగడం లేదు. ఆ మధ్య టైటిల్‌ ను రివీల్‌ చేసి టీజర్‌ను విడుదల చేశారు. ఆ టీజర్‌కి మంచి స్పందన వచ్చినా మళ్లీ సైలెంట్‌ అయ్యింది. సంక్రాంతికి ఉన్న పోటీని తట్టుకోవాలి అంటే సినిమాను ఇప్పటి నుంచే ప్రమోట్‌ చేయాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.. బాబీ షూటింగ్‌ పూర్తి అయ్యే వరకు ప్రమోషన్‌ మొదలు పెట్టకుంటే ఇప్పటికే వెనక పడ్డ డాకు మహారాజ్ మరింత వెనుక పడే అవకాశాలు ఉన్నాయి.. ఇక ప్రమోషన్స్ ఎంత గట్టిగా ఇస్తే అంతగా సినిమా రిజల్ట్ ఉంటుందని అభిప్రాయ పడుతున్నారు. మరి బాబీ ఏదైనా అప్డేట్ ను ఇస్తారేమో చూడాలి.. బాలయ్య సినిమా పై అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. గతంలో సంక్రాంతికి వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి..


Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×