Pushpa Movie Pre Release Event : మెగా ఫ్యాన్స్ కి మరియు అల్లు ఫ్యాన్స్ కి మధ్య కోల్డ్ వారు జరుగుతున్న సంగతి తెలిసిందే. సరైనోడు సినిమాకి సంబంధించిన సక్సెస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గురించి అడిగినప్పుడు ఆన్ స్టేజ్ పై అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అంటే చెప్పుకొచ్చాడు. అక్కడితో ఈ ఈ వార్ స్టార్ట్ అయింది. అయితే ఒక మనసు సినిమా ఆడియో లాంచ్ లో దీని గురించిన క్లారిటీ దాదాపు పది నిమిషాలు పాటు అల్లు అర్జున్ ఇచ్చాడు. కానీ అల్లు అర్జున్ ఇచ్చిన క్లారిటీ కి ఎవరు కన్వే కాలేదు. అక్కడినుంచి అల్లు ఫ్యాన్స్ కి మెగా ఫ్యాన్స్ కి మధ్య చిన్నపాటి వివాదాలు మొదలయ్యాయి. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. దాదాపు ఒక పది సంవత్సరాలు పాటు అలుపెరగని పోరాటం చేసిన తర్వాత నేడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపడుతున్నారు.
పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వమైన వైఎస్ఆర్సిపి మీద ఏ రేంజ్ లో విమర్శలు చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రశ్నించడమే ద్వేయంగా పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లారు. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ పర్సనల్ టార్గెట్ గా కూడా ఆ అధికార పార్టీకి మారిపోయాడు. పవన్ కళ్యాణ్ చేసిన సినిమా టికెట్ రేట్లు కూడా విపరీతంగా తగ్గించారు. ఇక 2024 ఎలక్షన్స్ సంబంధించి వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ కు అల్లు అర్జున్ సపోర్ట్ చేయడమైనది తీవ్రమైన దుమారం అయిపోయింది. అక్కడితో అల్లు వర్సెస్ మెగా మరింత పీక్ కు చేరింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఫ్యాన్ వార్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి చాలామంది మెగా ఫ్యాన్స్ మాట్లాడుతూ అందరూ నిబ్బా నిబ్బి లు ఉంటారు అని అంటూ ఉంటారు. సోషల్ మీడియా వేదికగా ఏమైనా పోస్ట్ చేసినా కూడా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అంటూ ఉంటారు. అయితే పుష్ప 2 సినిమా రిలీజ్ కి దగ్గరున్న సందర్భంలో ఈ సినిమా ఈవెంట్ ను నిర్వహించింది చిత్ర యూనిట్.
ఈవెంట్ కి అల్లు అర్జున్, అల్లు అర్హ కూడా హాజరయ్యారు. వీరిద్దరూ ప్రత్యేక అట్రాక్షన్ గా నిలిచారు. అల్లు అయన మాట్లాడుతూ సినిమాకి బెస్ట్ విషెస్ చెప్పాడు. అల్లు అర్హ కూడా మాట్లాడుతూ స్టేజ్ పైన ప్రవరుని స్వాగతం లోని పద్యం చెప్పింది.
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
అని చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఇది విన్న వెంటనే యాంకర్ సుమ కూడా ఇదంతా మీకు హోం వర్క్ ఇస్తున్నాను యూట్యూబ్ లో చూసుకొని ఇది నేర్చుకోండి అంటూ చాలా క్యాజువల్ గా చెప్పింది. ఈ వీడియో కూడా ఇప్పుడు కొంతమంది మెగా ఫ్యాన్స్ షేర్ చేస్తూ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ను పిల్లలు అంటూ ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read : Director Buchi Babu Sana: డైరెక్టర్ బుచ్చిబాబు కు భారీ ఎలివేషన్స్ ఇస్తున్న మెగా ఫ్యాన్స్