Kakinada PDS Rice Sumggling: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దెబ్బకు కాకినాడ పోర్టు చుట్టూ తెలుగు రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి. రైస్ మాఫియా వ్యవహారం ఏపీలోనే కాదు.. తెలంగాణలోనూ ప్రకంపనలు రేగుతున్నాయి.
గత ప్రభుత్వాల అండదండలతో రైస్ మాఫియా రెచ్చిపోయింది. లక్షల టన్నుల్లో బియ్యం విదేశాలకు ఎగుమతి చేసింది. ఎగుమతులకు అనుకూలంగా ఉండేవారిని కాకినాడ పోర్టు బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. దీనిపై ఏపీ ప్రభుత్వ పెద్దలు ఫోకస్ చేశారు.
రైస్ మాఫియాపై తీగ లాగితే డొంక కదులుతోంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసే రైస్ మాఫియాను డిప్యూటీ సీఎం పవన్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతో డొంక కదిలింది. ఇందులో ప్రమేయమున్న కొందరిలో టెన్షన్ మొదలైంది. ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియక గింజుకుంటున్నారు.
ఈ వ్యవహారంలో అవసరముంటే కేంద్ర పెద్దలతో మాట్లాడుతానంటూ డిప్యూటీ సీఎం పవన్ ప్రకటనతో మాఫియా వెన్నులో వణుకు మొదలైంది. రైస్ మాఫియా వెనుక ఏపీతోపాటు తెలంగాణకు చెందిన కొందరు నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్రీన్ ఛానెల్ ద్వారా ఈ యవ్వారం నడిపినట్టు తెలుస్తోంది. దీంతో ఏపీ అధికారులు అంతర్గతంగా విచారణ మొదలు పెట్టినట్టు ప్రభుత్వ వర్గాల మాట.
ALSO READ: సంక్రాంతికి ముందే వైసీపీ ఖాళీ? జగనన్నా నీకో నమస్కారం.. జాయినింగ్‌కు రూట్ క్లియర్
ఇదిలావుండగా కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోర్టులో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడంపై సీఐడీకి ఫిర్యాదు చేసింది కాకినాడ పోర్టు యాజమాన్యం. బెదిరింపులు, వేధింపులకు పాల్పడి మేజర్ వాటాను కైవసం చేసుకున్నారని అందులో ప్రస్తావించింది. సీఐడీ చీఫ్ రవిశంకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ చైర్మన్ కేవీరావు.
దీంతో రైస్ మాఫియా వ్యవహారం కాస్త కాకినాడ పోర్టుపై పడింది. యాజమాన్యం ఫిర్యాదుతో సీఐడీ రంగంలోకి దిగినట్టు అంతర్గత సమాచారం. పోర్టు గుట్టు తేలితే.. రైస్ మాఫియా వ్యవహారం ఓ కొలిక్కి రావచ్చని అధికారుల అంచనా.
రైస్ మాఫియాకు తెలంగాణ రాజకీయాలకు సంబంధం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. గత ఐదేళ్లలో కాకినాడ పోర్టు నుంచి ఏ స్థాయిలో పీడీఎస్ రైస్‌ను ఎగుమతి చేసిందో కళ్లకు కట్టినట్టు లెక్కలన్నీ వివరించారు మంత్రి నాదెండ్ల మనోహన్.
ప్రభుత్వ లెక్కల ప్రకారం.. ఏపీలో రైస్ దిగుబడి ఆ స్థాయిలో లేదు. లక్షల టన్నుల బియ్యం కాకినాడ పోర్టుకు ఎలా వచ్చిందనేది ఆరా తీసే పనిలో పడ్డారట అధికారులు. దీంతో తెలంగాణ నుంచి రైస్ వచ్చిందనే అనుమానాలు మొదలయ్యాయి.
ఒక్కసారి వెనక్కి వెళ్తే.. కరోనా సమయంలో రైస్ మాఫియా దందా సాగింది. తెలంగాణ నుంచి ఏపీకి బియ్యం వెళ్తోందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఆ సమయంలో ఏపీ-తెలంగాణ మధ్య చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు అధికారులు. రెండోసారి లాక్ డౌన్ ముగిసిన తర్వాత ఆ విషయాన్ని మరిచిపోయారు.
రైస్ అక్రమంగా ట్రాన్స్‌పోర్టు వెనుక కొంతమంది బీఆర్ఎస్ నేతలు, మిల్లర్ల హస్తముందని వార్తలు వచ్చాయి. అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోవడంతో సైలెంట్ అయ్యింది. ఆ వైపుగా ఏపీ అధికారులు దృష్టి పెట్టినట్టు పొలిటికల్ సర్కిల్స్ వార్తలు జోరందుకుంటున్నాయి. దీనిపై రానున్న రోజుల్లో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
కాకినాడ పోర్ట్ వ్యవహారంలో కీలక పరిణామం
కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో 41.12% వాటాను అరబిందో దక్కించుకోవడం పై CID కి ఫిర్యాదు
బెదిరించి, వేధింపులకు గురి చేసి, దౌర్జన్యంగా మేజర్ వాటా ను కైవసం చేసుకున్నారని ఫిర్యాదు చేసిన కాకినాడ పోర్ట్ యాజమాన్యం
CID చీఫ్ రవిశంకర్ ను కలిసి… pic.twitter.com/I4a4XwQFKR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 3, 2024