Aparna Vinod : ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో డివోర్స్, పెళ్లిళ్లు అనేవి సర్వసాధారణంగా మారాయి. కొంతమంది సెలబ్రిటీలు పెళ్లితో వార్తల్లో నిలిస్తే, మరికొంత మంది డివోర్స్ బాట పట్టి అభిమానులకు షాక్ ఇస్తున్నారు. తాజాగా మలయాళ హీరోయిన్ అపర్ణ వినోద్ (Aparna Vinod) పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకున్నట్టు ప్రకటించి, అభిమానులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని ఆమె అఫీషియల్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
రెండేళ్లకే డివోర్స్
ప్రముఖ మలయాళ హీరోయిన్ అపర్ణ వినోద్ (Aparna Vinod) తాజాగా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో తాను విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అపర్ణ 2023 ఫిబ్రవరిలో కోజికోడ్ కు చెందిన రినీల్ రాజ్ పీకేని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. గత కొన్ని రోజులుగా ఈ బ్యూటీ విడాకులు తీసుకోబోతుందని రూమర్లు వినిపిస్తుండగా, తాజాగా అపర్ణ వినోద్ స్వయంగా ఆ వార్తలను నిజం చేసింది. సోషల్ మీడియాలో చేసిన పోస్టులో ఆమె తన ఫ్రెండ్స్, ఫాలోవర్స్ ని ఉద్దేశిస్తూ ఎమోషనల్ నోట్ రాసింది. అందులో తన వైవాహిక ప్రయాణం గురించి, అందులోని ఇబ్బందుల గురించి వెల్లడించింది. అందుకే ఈ అధ్యాయాన్ని ఇక్కడితో ముగించి, వివాహ బంధానికి గుడ్ బై చెప్పాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు ఆమె వివరించింది.
అపర్ణ దాస్ (Aparna Vinod) షేర్ చేసిన ఆ నోట్ లో “డియర్ ఫ్రెండ్స్, ఫాలోవర్స్… నేను రీసెంట్ గా నా జీవితంలో జరిగిన ఓ ముఖ్యమైన మార్పును మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. చాలాకాలం ఆలోచించిన తర్వాత నేను నా మ్యారేజ్ లైఫ్ కి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యాను. ఇదేమంత ఈజీ కాదు. కానీ నేను ఎదగడానికి, కోలుకోవడానికి ఇదే కరెక్ట్ దారి అని నేను నమ్ముతున్నాను. పెళ్లి వల్ల నేను జీవితంలో ఎమోషనల్ గా అలసిపోయాను. పైగా ఇది నాకు చాలా కష్టమైన దశ. అందుకే ముందుకు వెళ్లడానికి నేను పెళ్లి అనే ఈ అధ్యాయాన్ని ముగించాను. ఈ టైంలో నాకు లభించిన ప్రేమ, సపోర్ట్ కి కృతజ్ఞతలు” అంటూ రాస్కొచ్చింది. దీంతో ఆమె సినిమాలలో నటించడానికి భర్త అడ్డు చెప్పడం వల్లే అపర్ణ ఈ నిర్ణయం తీసుకుందా ? అనే చర్చ మొదలైంది.
అపర్ణ వినోద్ ఎవరు ?
2015లో మలయాళ చిత్రం ‘న్జన్ నిన్నోడు కూడెయుండు’తో సినీరంగ ప్రవేశం చేసింది హీరోయిన్ అపర్ణ (Aparna Vinod). ఆసిఫ్ అలీ సరసన నటించిన ఆమె రెండవ చిత్రం ‘కోహినూర్’తో పాపులర్ అయ్యింది. అదే పాపులారిటితో ఆమె తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి కాలు పెట్టింది. 2017లో తలపతి విజయ్, కీర్తి సురేష్ నటించిన ‘భైరవ’ సినిమా అపర్ణ ఫస్ట్ తమిళ మూవీ. ఆమె చివరిగా 2021లో వచ్చిన తమిళ మూవీ ‘నడువన్’లో ప్రధాన పాత్రలో కనిపించింది. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన అపర్ణ తాజాగా డివోర్స్ ప్రకటించి వార్తల్లో నిలిచింది. మరి డివోర్స్ తరువాత ఆమెకు ఇండస్ట్రీ నుంచి అవకాశాలు వస్తాయా? అనేది చూడాలి.