Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh) సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఏం చేసినా సరే సెన్సేషన్ గానే మారుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వీరాభిమానిని, పరమ భక్తుడిని అని చెప్పే బండ్ల గణేష్ అవతల వారిని టార్గెట్ చేస్తే దబిడి దిబిడే అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి. అంతేకాదు పవన్ జోలికి ఎవ్వరు వచ్చినా బండ్లన్న ఊరుకోరు. జనసేన ఫార్మేషన్ డే సంబరాలు జరుగుతున్న వేళ బండ్ల గణేష్ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఆయన ఆ ట్వీట్ ను ఎవరిని ఉద్దేశించి చేశారు? అని వివరాల్లోకి వెళ్తే…
స్వీయ నియంత్రణ లేదు
బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు తీశారు. ముఖ్యంగా ‘గబ్బర్ సింగ్’ సినిమాతో బండ్ల గణేష్ ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అయితే ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ట్వీట్లు ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు అన్నది అర్థం కాకుండా ఉంది. తాజాగా జనసేన ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్న వేళ బండ్ల గణేష్ చేసిన మరో ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది.
“యుద్ధంలో వేల మంది ప్రత్యర్థులను సంహరించిన వాడి కన్నా… తన మనసును తాను జయించిన వాడే అసలైన వీరుడు. స్వీయ నియంత్రణతో తనను తాను వశపరచుకోగలిగిన మనిషిని ఎవరూ ప్రభావితం చేయలేరు. సమయాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే” అని ట్వీట్ చేశారు బండ్ల గణేష్.
దీంతో ఈ యుద్ధం, దోపిడీ గురించి బండ్లన్న ఎవరికి లెక్చర్స్ ఇస్తున్నాడు అనేది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంతమంది బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ ని అంటున్నాడు అని కామెంట్స్ చేస్తుండగా, మరి కొంతమంది మాత్రం “ఏంటన్నా మనం బాస్ ప్రోగ్రాంకి వెళ్ళట్లేదా?” అని ప్రశ్నిస్తున్నారు. మరి బండ్లన్న ఈ ట్వీట్ ఎవరిని ఉద్దేశించి చేశారో ఆయనే క్లారిటీ ఇవ్వాలి.
ఫ్యాన్స్ ను కన్ఫ్యూజన్ లో పడేస్తున్న బండ్లన్న
తెలంగాణ ఎన్నికల టైంలో మీడియాలో తెగ హల్చల్ చేసిన బండ్ల గణేష్, కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ప్రచారం కూడా చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీపై వరుసగా ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచారు. అలాగే సినిమా వివాదాలపై కూడా ఆయన స్పందిస్తుండడం గమనార్హం. ఇటీవల పవన్ కళ్యాణ్ వల్ల చాలా నష్టపోయాను అని సంచలన ఆరోపణలు చేసిన నిర్మాత సింగనమల రమేష్ కు బండ్ల కౌంటర్ ఇచ్చారు. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ కామెంట్స్ పై చెలరేగిన వివాదంపై స్పందించారు. ఈ నేపథ్యంలోనే అసలు ఏ రాజకీయ పార్టీని లేదా ఎవరిని ఉద్దేశించి బండ్ల గణేష్ ఇలాంటి ట్వీట్ చేశారు అనే కన్ఫ్యూజన్ నెలకొంది బండ్లన్న అభిమానుల్లో. ఇదిలా ఉండగా త్వరలోనే ‘తీన్మార్’ మూవీని రీరిలీజ్ చేయబోతున్నట్టు హింట్ ఇచ్చారు బండ్ల గణేష్.
యుద్ధంలో వేల మంది ప్రత్యర్థులను సంహరించినవాడి కన్నా,తన మనసును తాను జయించిన వాడే అసలైన వీరుడు.స్వీయ నియంత్రణతో..తనను తాను వశపరుచుకోగలిన మనిషిని ఎవరు ప్రభావితంచేయలేరు,సమయాన్ని వృథా చేయడమంటే నిన్ను నువ్వు దోపిడీ చేసుకోవడమే!’’
— BANDLA GANESH. (@ganeshbandla) March 14, 2025