Bandaru Supritha: ఎన్నో ఏళ్లుగా తెలుగు తెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, లేడీ కమెడియన్‌గా నటిస్తూ ప్రేక్షకులకు దగ్గరయ్యింది సురేఖ వాణి (Surekha Vani). ఇక గత కొన్నేళ్లలో సోషల్ మీడియా ద్వారా కూడా తన ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంది. సోషల్ మీడియాలో తనకంటూ కాస్త ఫాలోయింగ్ వచ్చిన తర్వాత తన కూతురు సుప్రితను కూడా ప్రేక్షకులకు పరిచయం చేసింది సురేఖ వాణి. తనలాగా తన కూతురు నటి కాకపోయినా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా సెటిల్ అయిపోవాలని అనుకుంది. అందుకే సోషల్ మీడియాలో పోస్టులతో, రీల్స్‌తో తనకంటూ భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. తాజాగా తన ఇన్‌స్టాలో అందరికీ క్షమాపణ చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.
ముందు జాగ్రత్త
ఈరోజుల్లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ చాలామంది ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు ప్రమోటర్స్‌గా మారిపోయారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్పిన మాటలు వింటూ చాలామంది ఈ యాప్స్‌లో డబ్బులు పెట్టి మోసపోతున్నారు. చాలామంది ఇందులో బెట్టింగ్ చేయడం కోసం అప్పులు కూడా చేసి ఆ అప్పులు తీర్చలేక ప్రాణాలు సైతం తీసుకుంటున్నారు. అందుకే ఈ బెట్టింగ్ యాప్స్‌పై పోలీసులు, అధికారులు సీరియస్ అవుతున్నారు. ఇప్పటికే కొందరు ఇన్‌ఫ్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. ఇలాంటి చట్టపరమైన ఇబ్బందులు వస్తాయని ముందుగానే జాగ్రత్త పడింది సుప్రిత (Supritha). అందుకే బెట్టింగ్ యాప్స్ గురించి చెప్తూ ఒక వీడియో రిలీజ్ చేసింది.
డిలీట్ చేసేయండి
‘‘కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేశారు. వాళ్లలో నేను కూడా ఒకదాన్ని. ఇప్పుడు అలా ప్రమోట్ చేయడం నేను ఆపేశాను. దానికి మీ అందరినీ క్షమాపణలు కోరుతున్నాను. ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం చూస్తే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. ఈజీ మనీకి అలవాటు పడొద్దు. అలాంటి యాప్స్ ఏమైనా ఫోన్‌లో ఉంటే డిలీట్ చేసేయండి. వాటిని ప్రమోట్ చేస్తున్నవారిని ఫాలో కూడా అవ్వొద్దు. అందరికీ థాంక్యూ అండ్ శారీ’’ అని చెప్పుకొచ్చింది సుప్రిత. మొత్తానికి అధికారులు తనవరకు రాకముందే ముందు జాగ్రత్తగా బహిరంగ వీడియో విడుదల చేసి సుప్రిత తప్పించుకుందని నెటిజన్లు అనుకుంటున్నారు.
Also Read: మేల్ డామినేషన్‌పై మండిపడ్డ కుష్భూ.. ఇప్పటికీ ఆ అహంకారం తగ్గలేదంటూ.?
చాలామందిపై కేసులు
ఈరోజుల్లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ పేరుతో చాలామంది ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇతర సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. అలాంటి వారు చాలామంది బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తూ లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటివరకు అలా ప్రమోట్ చేసిన చాలామందిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. అందుకే వెంటనే ఇతర ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా అలర్ట్ అయ్యారు. తమ సోషల్ మీడియాలో అలాంటి యాప్స్‌కు సంబంధించిన ప్రమోషనల్ వీడియోలు డిలీట్ చేయడం మొదలుపెట్టారు. ఇక వారిలాగానే సుప్రిత కూడా అవన్నీ డిలీట్ చేయడంతో పాటు అందరికీ బహిరంగంగా క్షమాపణలు చెప్పింది. దీంతో ఫాలోవర్స్ అంతా తను ముందుగానే జాగ్రత్తపడిందని, ఇలా గ్రహించి సమస్యల నుండి తప్పించుకోవడం మంచిదే అని ఫీలవుతున్నారు.
నన్ను క్షమించండి.. తెలియక ప్రమోట్ చేసాను: సురేఖ వాణి కూతురు
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్ పై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
ఈ క్రమంలో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ వీడియో పోస్ట్ చేసిన సురేఖ వాణి కూతురు సుప్రీత
కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్ తెలిసో తెలియకో బెట్టింగ్… pic.twitter.com/spt1tc18N2
— BIG TV Breaking News (@bigtvtelugu) March 14, 2025