BigTV English

Bangalore Rave Party: నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఛార్జ్ షీట్.. ఎక్కడికైనా వస్తా.. నిరూపిస్తారా? అని హేమ సవాల్!

Bangalore Rave Party: నటి హేమ డ్రగ్స్ తీసుకుందని ఛార్జ్ షీట్.. ఎక్కడికైనా వస్తా.. నిరూపిస్తారా? అని హేమ సవాల్!

Big Twist in Bangalore Rave Party Case: టాలీవుడ్ నటి హేమకు బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ట్విస్ట్ నెలకొంది. తాజాగా, ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ మేరకు ఛార్జ్ షీట్‌లో టాలీవుడ్ నటి హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఎండీఎంఏ డ్రగ్స్ సేవించినట్లు మెడికల్ రిపోర్టు జతపర్చారు. మే 19న బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జరిగిన రేవ్ పార్టీకి హేమ స్నేహితుడు వాసు పిలిచినట్లు పోలీసుల నిర్ధారించారు.


ఈ రేవ్ పార్టీని మొత్తం 9మంది నిర్వహించారని, ఇందులో నటి హేమతో పాటు 88మంది డ్రగ్స్ తీసుకున్నట్లు వివరించారు. ఈ కేసులో ఇప్పటికే నటి హేమ బెంగళూరులోని పరప్ప అగ్రహార జైలులో 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, నటి హేమ, చిత్తూరుకు చెందిన డాక్టర్ రణధీర్ బాబుతోపాటు 9మందిపై ఛార్జీ షీట్ దాఖలు అయిందని తెలుస్తోంది. అయితే ఈ కేసులో భాగంగా బెంగళూరు పోలీసులు 1,086 పేజీల ఛార్జ్ షీట్‌ను దాఖలు చేశారు.

కాగా, బెంగళూరులోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు రైడ్ చేయగా.. పోలీసులకు డ్రగ్స్, కొకైన్ లభ్యమయ్యాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఫామ్‌హౌస్ యజమాని గోపాల్ రెడ్డికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆయనతోపాటు ఈ రేవ్ పార్టీ కేసులో అరుణ్ కుమార్, రణధీర్ బాబు పేర్లను ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు.


ఇందులో భాగంగానే ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే అభియోగంతో నటి హేమపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, కేసు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆమె బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. ఇరు పక్షాల వాదనలు విన్న బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు.. నటి హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ డ్రగ్స్ కేసు సినీ పరిశ్రమలో తీవ్ర దుమారం రేగడంతో ఆమె సభ్యత్వాన్ని ‘మా’ రద్దు చేసింది. ఆ తర్వాత ఆగస్టులో ఆమెపై విధించిన ‘మా’ బ్యాన్ ఎత్తివేసింది.

Also Read: దేవర సినిమా చూసి చనిపోతా.. బతికించండి ప్లీజ్..

నటి హేమ పేరు ఛార్జీ షీట్‌లో ఉందని వస్తున్న వార్తలపై ఆమె స్పందించింది. నేను డ్రగ్స్ తీసుకోలేదని, బెంగళూరు పోలీసులు ఛార్జీ సీట్‌లో నా పేరు వచ్చినట్లు మీడియా ద్వారా తెలిసిందన్నారు. నేను డ్రగ్స్ తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైన రెడీ అంటూ సవాల్ విసిరారు. పోలీసుల ఛార్జ్ షీట్ నాకు వచ్చిన వెంటనే ఈ విషయంపై స్పందిస్తాననన్నారు. ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు డ్రగ్స్ రిపోర్టులో నెగిటివ్ అని ఛార్జ్ షీట్‌లో రాశారన్నారు. ఎండీఎంఏ నేను డ్రగ్స్ తీసుకోలేదుని, కొన్ని మీడియాలో వచ్చిన వార్తల కారణంగానే నా పేరు ఛార్జ్ షీట్‌లో పెట్టారని నటి హేమ చెప్పుకొచ్చింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×