Akhanda2 : రీసెంట్ టైమ్స్ లో చెప్పిన డేటుకు సినిమాలు రిలీజ్ చేయట్లేదు గాని ఒకప్పుడు ఒక డేట్ ఇచ్చారు అంటే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు నిర్మాతలు. సినిమాకి ఎంతో పెద్ద సమస్య వస్తే కానీ ఆ సినిమాను వాయిదా వేసేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఒక చిన్న సమస్య వస్తే చాలు ఉన్నఫలంగా సినిమాను వాయిదా వేస్తున్నారు. థియేటర్ కు ప్రేక్షకులు రాకపోవడానికి పెద్ద పెద్ద కారణాలు చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ఇలాంటి చిన్న చిన్న కారణాలు కూడా ప్రేక్షకులను థియేటర్ కు దూరం చేస్తాయి. ఒకటి రెండేళ్లు తరువాత తమ అభిమాన హీరో సినిమా థియేటర్లోకి వస్తుంది అని ఎదురు చూస్తున్న తరుణంలో సడన్ గా డేట్ మారుస్తూ ఉంటారు. దానివలన ప్రేక్షకులకు కొద్దిపాటి నిరాశ మిగులుతుంది. సినిమా మీద ఉన్న ఎక్సైట్మెంట్ కూడా పోతుంది. కానీ ఈ పాయింట్ ఎవరూ పెద్దగా మాట్లాడరు.
అఖండ 2 వాయిదా పడే అవకాశం
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా అఖండ సినిమా ఎంత పెద్ద హిట్ అయింది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అఖండ సినిమాకి సీక్వెల్ గా అఖండ 2 విడుదల కానుంది. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ టీజర్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా ఈ టీజర్ లో త్రిశూలం షాట్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ షాట్ ని ఇష్టపడిన వాళ్లు ఎంతమంది ఉన్నారో అలానే ట్రోల్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ ఆ డేట్ కి సినిమా విడుదలవుతుంది అని నమ్మకాలు లేవు.
ప్రభాస్ సినిమాతో పోటీగా
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ రాజా సాబ్ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దీనికి కారణం రీసెంట్ గా మారుతి ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటైతే, ఈ సినిమాలో ప్రభాస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ మరోసారి బయటకు రాబోతుంది అనేది కూడా మరో కారణం. ఇక అఖండ 2 సినిమాను ఓజి సినిమాకు పోటీగా విడుదల చేస్తున్నారు అని అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను డిసెంబర్ మొదటి వారంలో రిలీజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి సంబంధించి సిజి వరకు కూడా చాలా వరకు పెండింగ్ ఉంది. కానీ ఓజీ మాత్రం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఒకవేళ డిసెంబర్ మొదటి వారానికి ఈ సినిమాను పోస్ట్ పోన్ చేస్తే ప్రభాస్ రాజా సాబ్ సినిమాకు పోటీ అని చెప్పొచ్చు.
Also Read: Rowdy Janardhan : రౌడీ జనార్ధన్ కాన్సెప్ట్ ఇదే, రౌడీ హీరో ఫ్యాన్స్ కు మాస్ ట్రీట్