BigTV English

Bhairavam Postponed : బెల్లంకొండ శ్రీనివాస్ “భైరవం” పోస్ట్ పోన్… “పుష్ప 2” వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్

Bhairavam Postponed : బెల్లంకొండ శ్రీనివాస్ “భైరవం” పోస్ట్ పోన్… “పుష్ప 2” వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్

Bhairavam Postponed : టాలీవుడ్ యంగ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ క్రేజీ మల్టీ స్టారర్ ‘భైరవం’ (Bhairavam). డిసెంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా తాజాగా పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది.


విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ‘భైరవం’ (Bhairavam) సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నారు. ఆయనతో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై కేకే రాధా మోహన్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ‘భైరవం’ షూటింగ్ శర వేగంగా జరుగుతుండగా, రీసెంట్ గా ఈ సినిమాలో హీరో హీరోయిన్ల లుక్స్ ని రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో పాటు మంచు మనోజ్, నారా రోహిత్ లా లుక్స్ రిలీజ్ అయ్యాయి. అలాగే హీరోయిన్లు అతిది శంకర్, దివ్య పిళ్లై, ఆనందిల ఫస్ట్ లుక్ పోస్టర్ లను కూడా రిలీజ్ చేశారు. సినిమాలో హీరోలంతా రగ్డ్ అండ్ మాస్ అవతార్లో కనిపిస్తుండడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ మూవీని ఈ ఏడాది డిసెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడిచింది.

నిజానికి ఈ సినిమాను 2025 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ అప్పటికే ‘గేమ్ ఛేంజర్’ మూవీతో రామ్ చరణ్, బాలయ్య బాబీ సినిమా, మరో మూవీతో సందీప్ కిషన్, వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు సంక్రాంతిపై కర్చీప్ వేశారు. దీంతో ‘భైరవం’ (Bhairavam) డిసెంబర్ రిలీజ్ కి వచ్చేసింది. కానీ ఇక్కడ ‘పుష్ప 2’ వైల్డ్ ఫైర్ ముందు నిలబడడం కష్టం కాబట్టి… మరోసారి ఈ మూవీ పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తోంది. ‘చత్రపతి’ లాంటి భారీ డీజాస్టర్ తర్వాత బెల్లంకొండ నటిస్తున్న ఈ సినిమాపై చాలా నమ్మకం పెట్టుకున్నాడు. అందుకే ఇలా పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినప్పుడు కాకుండా సోలోగా రిలీజ్ అయితే బెటర్ అని ఆలోచనలో ఉన్నారట మేకర్స్. కేవలం బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రమే కాదు ఈ సినిమాలో నటిస్తున్న మరో ఇద్దరు హీరోలకు కూడా ఈ మూవీ హిట్ కావడం చాలా ముఖ్యం. బెల్లంకొండ, నారా రోహిత్, మంచు మనోజ్ ముగ్గురి ఖాతాలోనూ హిట్ అన్నది లేక చాలా ఏళ్ళే అవుతోంది. అందుకే ఈ ముగ్గురూ ‘భైరవం’ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.


డిసెంబర్ 25న ‘పుష్ప 2’ (Pushpa 2) రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ఫీవర్ కచ్చితంగా నాలుగు వారాల పాటు ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆ సునామీలో కొట్టుకుపోకుండా ఉండాలంటే మూవీని పోస్ట్ పోన్ చేయడమే బెటర్ అంటున్నారు మూవీ లవర్స్. మరి ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.  ఇక ఈ మూవీతో పాటే మరిన్ని సినిమాలు కూడా పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×