BigTV English

Pushpa 2 : పుష్ప చిరిగింది… పవన్ అడ్డాలో అలజడి

Pushpa 2 : పుష్ప చిరిగింది… పవన్ అడ్డాలో అలజడి

Pushpa 2 : మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘పుష్ప 2’ (Pushpa 2) విషయంలో నిమిష నిమిషానికి ఒక ట్విస్ట్ వెలుగులోకి వస్తుంది. మెగా వర్సెస్ అల్లు (Mega Vs Allu) వివాదం కారణంగా ఈ సినిమా రిలీజ్ విషయంలో మెగా అభిమానులు గుర్రుగా ఉన్నారు. తమ అసహనాన్ని వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదు. తాజాగా ఏపీలో ‘పుష్ప 2’ కోసం వేసిన బ్యానర్లలో కేవలం అల్లు అర్జున్ (Allu Arjun) ముఖాన్ని మాత్రమే చించేయడం సంచలనంగా మారింది.


అసలేం జరిగిందంటే… అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన మూవీ “పుష్ప 2” (Pushpa 2). ఈ ప్రెస్టీజియస్ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ నడుస్తోంది. ఎప్పటి నుంచో కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్న మూవీ లవర్స్ రేపు ‘పుష్ప 2’ సినిమాను థియేటర్లలో వీక్షించబోతున్నారు. దీంతో కొన్ని రోజుల ముందు నుంచే పుష్ప జాతర మొదలైంది. కానీ మరోవైపు ఈ సినిమా రిలీజ్ విషయంలో మెగా అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా పిఠాపురంలో పుష్ప రాజ్ కి ఎదురు దెబ్బ తగిలింది. అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని పోస్టర్స్ ను ఎవరో చించేయడం కొత్త చర్చకు దారి తీసింది. కొంత మంది అజ్ఞాతవ్యక్తులు ‘పుష్ప 2’ (Pushpa 2) పోస్టర్లను చించేశారు. అందులో కేవలం అల్లు అర్జున్ ఫోటోలు మాత్రమే కనిపించకుండా చేశారు. పక్కనే ఉన్న రష్మిక మందన్న ఫోటోని అస్సలు టచ్ చేయకపోవడం గమనర్హం. మరోవైపు ‘మా కోసం నువ్వు వచ్చావు. మీకోసం మేము వస్తాము’ అంటూ ‘పుష్ప 2’ కోసం జగన్ ఫోటోతో వైసిపి అభిమానులు ఫ్లెక్సీలు కట్టారు. ఆ ప్లెక్లీలలో కూడా జగన్ ఫోటో బాగానే ఉంది. కానీ అల్లు అర్జున్ ముఖం కన్పించకుండా ఆయన ఫోటోను మాత్రమే టార్గెట్ చేసి మరీ చించేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన పిఠాపురంలో పుష్ప పోస్టర్లను చించేసింది ఎవరు? అనే విషయంపై చర్చ మొదలైంది.


మొత్తానికి ఈ సినిమా వివాదం రాజకీయ రంగు పులుముకొంటున్నట్టుగా అనిపిస్తోంది. ఇక మరోవైపు జనసేన (Janasena) నేతలు… అల్లు అర్జున్ మెగా బ్రదర్స్ కి క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఈ సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని బహిరంగంగానే వార్నింగ్ ఇచ్చారు. మొత్తానికి “పుష్ప 2” రిలీజ్ విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. రోజురోజుకూ ఇది మరింత ముదురుతుండడం ఆందోళనకరంగా మారింది. ఈ విషయంపై ఇటు చిరుగానీ, అటు పవన్ గానీ ఇంకా నోరు మెదపకపోవడం గమనార్హం.

గత ఎలక్షన్స్ నుంచే మరింత ముదిరింది ‘పుష్ప 2’ వివాదం. ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కి అల్లు అర్జున్ సపోర్ట్ చేయలేదన్న సంగతి తెలిసిందే. నంద్యాలకు వెళ్లి ఆయన పవన్ కి ఆపోజిట్ గా ఉన్న వ్యక్తికి సపోర్ట్ చేయడాన్ని మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సంఘటన జరిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం, రీసెంట్ గా ‘మట్కా’ మూవీ ఈవెంట్లో వరుణ్ తేజ్ చేసిన కామెంట్స్ వంటి వరుస సంఘటనలతో అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయింది. ఇక రీసెంట్ గా ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి (Chiranjeevi) ని నిర్మాతలు గెస్ట్ గా పిలవాలి అనుకున్నారని, కానీ ఫాన్స్ ఇచ్చిన అల్టిమేటం కారణంగా చిరు ఈవెంట్ కు వెళ్లలేదని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఇలా అల్లు అర్జున్ పోస్టర్లను పవన్ కళ్యాణ్ అడ్డాలో చించడం అనేది వివాదాస్పదంగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×