Akhil Upcoming Movie: సిసింద్రీ సినిమాతోనే అతి చిన్న ఏజ్ లో చాలామంది ప్రేక్షకులను ఆశ్చర్యపరిచి మంచి పేరు సాధించుకున్నాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహించిన మనం సినిమాలో క్లైమాక్స్ లో కనిపించి విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తన ప్రతిభ పని చూపించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. అక్కినేని అఖిల్ ఎంత బాగా క్రికెట్ ఆడుతాడు అందరికీ తెలిసిన విషయమే. ఒక టైంలో అఖిల్ మంచి క్రికెటర్ అయిపోతాడని చాలామంది ఊహించరు. అయితే మొత్తానికి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. అఖిల్ అనే పేరుతో ఉన్న టైటిల్ ని ఎంచుకొని ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు. నితిన్ ఈ సినిమాని నిర్మించాడు.
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో సక్సెస్
బొమ్మరిల్లు భాస్కర్ చేసిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అఖిల్ కెరియర్ లో ఇదే మొదటి హిట్ సినిమా అని చెప్పాలి. ఈ సినిమాకి మంచి కలెక్షన్లు కూడా వచ్చాయి. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ అనే ఒక సినిమాను చేశాడు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఏజెంట్ సినిమా మినిమం అంచనాలను అందుకోలేకపోయింది. ఇక రీసెంట్ గానే ఈ సినిమా ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ కి వచ్చింది. ఇకపోతే అఖిల్ తన కొత్త సినిమాకి శ్రీకారం చుడుతున్నారు.
అఖిల్ కొత్త చిత్రం
అఖిల్ తన నెక్స్ట్ సినిమా వినరో భాగ్యము విష్ణు కథ దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో చేయబోతున్నారు. ఈ సినిమాకి లెనిన్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరగనుంది. ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు, సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ బ్యానర్ లో జరిగే ప్రతి సినిమా గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా తెలుస్తుంది. త్రివిక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే గాని కొన్ని సినిమాలు పట్టాలెక్కవు. ఇక మొత్తానికి త్రివిక్రమ్ దృష్టిలో అఖిల్ ఇప్పుడు పడ్డాడు అని చెప్పొచ్చు. ఒకప్పుడు అఖిల్ ను లాంచ్ చేయమని త్రివిక్రమ్ శ్రీనివాస్ ను అడిగితే తను డెబ్యూ హీరోస్ ని లాంచ్ చేయలేను అని వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ దర్శకుడిగా అఖిల్ తో పనిచేయకపోయినా ఇప్పుడు పరోక్షంగా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు యూవి క్రియేషన్స్ లో కూడా అఖిల్ ఒక సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: 7G Rainbow Colony 2 : షూటింగ్ చాలా వరకు అయిపోయింది… కానీ రిలీజ్ చేయలేని పరిస్థితి