BigTV English

Pushpa 3: పుష్ప 3 కోసం సన్నాహాలు చేస్తున్నాం: అల్లు అర్జున్

Pushpa 3: పుష్ప 3 కోసం సన్నాహాలు చేస్తున్నాం: అల్లు అర్జున్
Pushpa 3

Pushpa 3 (upcoming movies):


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా లెక్కల మాస్టార్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పాన్ ఇండియా మూవీ రేంజ్‌లో అందరినీ ఆకట్టుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అంతేకాకుండా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టి అందరినీ ఆశ్చర్యపరచింది. దాంతోపాటు ఇప్పటి వరకు ఏ తెలుగు హీరోకు దక్కని గౌరవాన్ని అల్లు అర్జున్ సొంతం చేసుకున్నాడు. ఏకంగా నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సాధించి సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు.


ఈ మూవీలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ చేసిన పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. బన్నీ డైలాగ్స్, మ్యానరిజం వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యాయి. సినీ, రాజకీయ, క్రికిట్‌కి సంబంధించిన ప్రముఖులు సైతం బన్నీ డైలాగ్స్‌.. మ్యానరిజంతో సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ వైరల్ అయ్యారు.

READ MORE: ‘పుష్ప 2’ సెట్స్‌లోకి ఎన్టీఆర్‌.. ఫొటో వైర‌ల్‌

అయితే ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. ‘పుష్ప’ ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్‌ సృష్టించిన తర్వాత ‘పుష్ప2’ మూవీని సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

ఇందులో భాగంగా ఇదివరకు విడుదల చేసిన గ్లింప్స్‌ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఈ గ్లింప్స్‌లో బన్నీ మాస్‌లుక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. ఈ మూవీ ఈ ఏడాది ఆగస్టు 15న పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీంతో ఈ మూవీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఈ మూవీ ఫ్యాన్స్‌కు అల్లు అర్జున్ ఓ గుడ్ న్యూస్ అందించాడు. పుష్ప మూవీకి 3 పార్ట్ ఉంటుందని కూడా తెలిపాడు. బన్నీ ఇటీవల బెర్లిన్ ఫిలిం ఫెస్టివల్‌కి వెళ్లాడు. అక్కడ ‘పుష్ప’ మూవీని ప్రదర్శించారు.

అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. పుష్ప సినిమాకు 3 పార్ట్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలిపాడు. అయితే దీనిని ఒక ఫ్రాంచైజ్‌లా తెరకెక్కించాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

READ MORE: పుష్ప 2 క్రేజీ అప్డేట్.. ఆ ఒక్క సీన్ కి పూనకాలే..

దీంతో పుష్ప 3 కూడా కచ్చితంగా ఉండబోతున్నట్లు చెప్పకనే చెప్పేసాడు. బన్నీ వ్యాఖ్యలపై ఇటు అభిమానులతో పాటు అటు ప్రేక్షకులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×